close
ఆకర్ష.. ఆకర్ష! 

పవన్‌ హన్స్‌ విక్రయానికి నిబంధనల సడలింపు 
బిడ్ల దాఖలుకు వచ్చే నెల 22 వరకు గడువు

దిల్లీ: హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ విక్రయాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. గతంలో రెండు సార్లు ప్రయత్నించి విఫలం కావడంతో ఈ సారి నిబంధనలను సడలించి బిడ్డర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రూ.350 కోట్ల నికర విలువ కలిగిన కంపెనీలు పవన్‌ హన్స్‌ కొనుగోలుకు బిడ్లు సమర్పించవచ్చని ఈ నెల 11న ప్రతిపాదించింది. ఇంతకు మునుపు ఉన్న నిబంధనల్లో కొన్నింటిని సడలించింది. అవేమిటంటే..

పవన్‌ హన్స్‌లో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగుల్ని కనీసం రెండేళ్ల పాటు కొనసాగించాలన్నది గత నిబంధన. ఏడాది పాటు కొనసాగిస్తే సరిపోతుందని ఇప్పుడు పేర్కొంది. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)లో వారిని పంపించవచ్చని తెలిపింది. 2019 ఏప్రిల్‌ 30 నాటికి, పవన్‌ హన్స్‌లో 718 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 415 మంది శాశ్వత, 303 మంది తాత్కాలిక ఉద్యోగులున్నారు. 
పవన్‌ హన్స్‌పై రూ.577 కోట్ల పన్ను వివాదం ఒకటి నడుస్తోంది. ఒకవేళ ఇది సంస్థకు వ్యతిరేకంగా వస్తే, ఆ పన్నును ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయించింది.

ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) గడువు : 2019 ఆగస్టు 22 
ఎంపికైన బిడ్డర్ల జాబితా ప్రకటన : 2019 సెప్టెంబరు 12న 
పవన్‌ హన్స్‌లో ప్రభుత్వ వాటా : 51%,  
ఓఎన్‌జీసీ వాటా : 49%, హెలికాప్టర్లు: 43

పవన్‌ హన్స్‌కు సంబంధించిన ఆస్తుల్ని బిడ్‌ దక్కించుకున్న సంస్థ మూడేళ్ల పాటు విక్రయించరాదనేది గతంలో ఉన్న నిబంధన. దీన్ని రెండేళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం తేల్చింది. 
2017 అక్టోబరు నుంచి పవన్‌ హన్స్‌ విక్రయానికి ప్రభుత్వం రెండు సార్లు ప్రయత్నించింది. కానీ వీలు కాలేదు. ఈ సారైనా బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శిస్తారేమో చూడాలి. 2019-20లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,05,000 కోట్లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.