close
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్‌ 

అంతర్లీనంగా ప్రతికూలతలు 
ఆర్థిక ఫలితాల ప్రభావం కనిపించొచ్చు 
విశ్లేషకుల అంచనాలు

ఈ వారం సూచీలు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్లీనంగా మాత్రం ప్రతికూల ధోరణి కనిపిస్తోందంటున్నారు. జూన్‌ త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు అంచనాలకు మించి రాణించడం నేటి (సోమవారం) మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు కూడా సూచీల కదలికలను ప్రభావితం చేయొచ్చు. ఎంపిక చేసిన స్క్రిప్‌లలో కదలికలు కనిపించొచ్చు. ఆదాయపు పన్ను సర్‌ఛార్జీ విషయంలో ఊరటనివ్వడానికి ఆర్థిక మంత్రి తిరస్కరించడం, ఎఫ్‌ఐఐల సెంటిమెంటుపై ప్రభావం చూపుతుంది. అమెరికా, చైనా పరిణామాలు, రుతు పవనాల కదలికలు, అంతర్జాతీయ వృద్ధి మందగమనంపై ఆందోళనలు,  నుంచి దేశీయ సూచీలు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. ఈనెల 30-31 తేదీల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశాలున్నందున, ఒడుదొడుకులు ఎదురుకావచ్చు. నిఫ్టీ-50 11,400-11,500 మధ్య కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

మొత్తం మీద మార్కెట్లకు సెంటిమెంటు బలహీనంగా ఉండడంతో రక్షణాత్మక ఐటీ షేర్లు రాణించే అవకాశం ఉంది. ఇతర రంగాల కంపెనీలతో పోల్చినా.. ఐటీ రంగ కంపెనీల ఫలితాలు స్థిరంగా ఉండడం కలిసొచ్చే అంశం. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ఫలితాలపై మార్కెట్‌ కన్నేయవచ్చు. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. ఆదాయం, స్టాండలోన్‌ లాభాల విషయాల్లో రికార్డులను సృష్టించిన నేపథ్యంలో ఆ ప్రభావం కనిపించొచ్చు. ప్రభుత్వ రంగ
చమురు కంపెనీల్లో ట్రేడింగ్‌ చాలా తక్కువ శ్రేణికి పరిమితం కావొచ్చు. ముడి చమురు ధరలు, రూపాయి మారకపు విలువలను మదుపర్లు గమనించొచ్చు. 
జియో బలమైన ఫలితాలను నమోదు చేసినా.. వరుసగా ఏడో త్రైమాసికమూ సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) తగ్గడం
టెలికాం కంపెనీలపై ప్రభావం చూపించవచ్చు. త్వరలోనే ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు మొదలు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరచవచ్చు. 
ఎల్‌ అండ్‌ టీ బలమైన ఆదాయ వృద్ధి నమోదు చేయవచ్చన్న అంచనాల మధ్య
యంత్రపరికరాల షేర్లు ఈ వారం లాభాల బాట పట్టొచ్చు. ఈ కంపెనీ మంగళవారం ఫలితాలను వెల్లడించనుంది. 
వాహన రంగ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించే ఫలితాలను బట్టి ఈ రంగ షేర్ల దిశ ఆధారపడి ఉంటుంది. గిరాకీలో మందగమనం కారణంగా వాహన కంపెనీల విక్రయాలు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 
బ్యాంకు షేర్లు ప్రతికూల ధోరణితో ట్రేడ్‌ కావొచ్చు. ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు మార్కెట్‌ సెంటిమెంటుపై ప్రభావం చూపొచ్చు. 
మంగళవారం వెలువడే హెచ్‌యూఎల్‌ ఫలితాలు బలహీనంగా నమోదు కావొచ్చన్న అంచనాల మధ్య
ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టాల పాలుకావొచ్చు. 
ఫార్మా షేర్లు చాలా తక్కువ శ్రేణిలో, ప్రతికూల ధోరణితో కదలాడవచ్చు. శుక్రవారం వెలువడే బయోకాన్‌ ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. 
లోహ, గనుల తవ్వక కంపెనీలు ఈ వారం బలహీనంగా కనిపించొచ్చు. ప్రాథమిక లోహాలపై సెంటిమెంటు కాస్త మెరుగైనా.. ఉక్కు తయారీదార్లు ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నారు. టాటా స్టీల్‌ లాభదాయకత బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.