close
హ్యుందాయ్‌ కార్లు ప్రియం 

రూ.9200 వరకు ధరలు పెంపు 
ఆగస్టు నుంచి అమలు

ముంబయి: ఆగస్టు 1 నుంచి పలు మోడళ్ల ధరలను రూ.9,200 వరకు పెంచనున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ప్రకటించింది. కొత్త మోడళ్లు వెన్యూ, ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కోనలను మాత్రం మినహాయించింది. తయారీ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ప్రభుత్వం కొత్తగా విధించిన భద్రతా నిబంధనలతో ముడి పదార్థాల ఖర్చులు పెరిగాయని వివరించింది. వివిధ విభాగాల్లో 10 కారు మోడళ్లను హ్యుందాయ్‌ విక్రయిస్తోంది. హ్యుందాయ్‌ పోర్ట్‌ఫోలియోలో శాంట్రో, గ్రాండ్‌ ఐ10, యాక్సెంట్‌, వెర్నా, క్రెటా, టక్సన్‌ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.3.9- 26.95 లక్షల శ్రేణిలో ఉన్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.