close
ఉద్యోగాలా.. లేవ్‌ లేవ్‌! 

కొత్త కొలువుల కోలాహలం అంతంతే 
కీలక రంగాల్లో ఆటోమేషన్‌ ప్రభావం 
2019-23పై టీమ్‌లీజ్‌ నివేదిక 
దిల్లీ

రానున్న రోజుల్లో ఉద్యోగాల సృష్టికి ఆశాజనక పరిస్థితులేవీ కనిపించడం లేదని ఓ నివేదిక పేర్కొంది. కీలక రంగాల్లోనూ ఉద్యోగాల కల్పన బాగా తగ్గిపోయే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ నివేదికను ఉటంకిస్తూ ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త కథనం వెల్లడించింది. 2019- 23లో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా), బీఐఓ, ఐటీ ఆధారిత సేవల రంగాల్లో ఉద్యోగాల సృష్టి 37 శాతం వరకు  పడిపోవచ్చని పేర్కొంది. ఉద్యోగాల సృష్టికి ఆటోమేషన్‌ ప్రధాన ప్రతిబంధకంగా నిలుస్తుందని అభిప్రాయపడింది. మార్కెటింగ్‌, అడ్వర్టయిజింగ్‌, వ్వయసాయం, వ్యసాయ రసాయనాలు, టెలికాం, మీడియా, వినోదం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో  కూడా ఉద్యోగ సృష్టి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వాహన, వాహన సంబంధిత రంగాలు, నిర్మాణ, స్థిరాస్తి, ఎఫ్‌ఎమ్‌సీడీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరగొచ్చని  పేర్కొంది. జాబ్స్‌ అండ్‌ శాలరీస్‌ ప్రైమర్‌- 2019, ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ నివేదికలను క్రోఢీకరించి పై విషయాలను టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. ఇందులో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాలను కూడా లెక్కలోకి తీసుకుంది. ‘నాలుగేళ్ల కాలానికి ఉద్యోగ సృష్టి అంచనాలను పరిశీలిస్తే మున్ముందు చాలా రంగాల్లో ఉద్యోగాల కల్పన తగ్గిపోయే అవకాశం ఉందని భావించవచ్చు. ఈ పరిస్థితి మారాలంటే ఉద్యోగ సృష్టిపై ఆటోమేషన్‌ ప్రభావాన్ని నియంత్రించే దిశగా యాజమాన్య సంస్థలు, విధానకర్తలు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంద’ని  టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంటు రితుపర్ణ చక్రవర్తి వెల్లడించారు. అయితే ఏప్రిల్‌- సెప్టెంబరు వరకు చూస్తే నియామకాలపరంగా కొంత ఆశావహ పరిస్థితి నెలకొందని తెలిపారు. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 95 శాతం సంస్థలు ఈ ఆరు నెలలో నియామకాలు పెరుగుతాయనే సంకేతాలు ఇచ్చాయని పేర్కొంది.

వేతనాల్లో రెండంకెల వృద్ధి! 
ప్రస్తుత సంవత్సరంలో కార్పొరేట్‌ కంపెనీల వేతనాల్లో రెండంకెల వృద్ధి ఉండొచ్చని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ తన జాబ్స్‌ అండ్‌ సాలరీస్‌ ప్రైమర్‌- 2019 నివేదికలో పేర్కొంది.  సగటున 10.95 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కీలక రంగాలకు మాత్రమే ఈ వేతనాల పెంపు పరిమితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.  మొత్తం 17 రంగాలు, తొమ్మిది నగరాల్లో టీమ్‌లీజ్‌ ఈ సర్వేని నిర్వహించింది. ఇందుకుగాను 2,00,000 వేతన రికార్డులను కూడా విశ్లేషణ చేసింది.వేతనాల వృద్ధి అత్యధికంగా ఉండే రంగాల్లో బ్యాంకింగ్‌- ఆర్థిక సేవలు- బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), బీపీఓ, ఐటీ ఆధారిత సేవలు, ఇ-కామర్స్‌, సాంకేతిక అంకురాలు, విద్యా సేవలు, ఎఫ్‌ఎమ్‌సీడీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ ముందు వరుసలో ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ రంగాల్లో వేతనాల పెంపు 13 శాతానికి పైగా ఉండే అవకాశం ఉంది.

* వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు, వాహన, స్థిరాస్తి, ఆతిథ్యం, తయారీ, మీడియా, వినోదం, విద్యుత్‌, ఇంధనం, రిటైల్‌, టెలికాం రంగాల్లో వేతనాల వృద్ధి 13% లోపే ఉండొచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.