Eenadu Online Edition Business News - EENADU
close
పసిడి ధగధగ!

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం, వెండి

పసిడి అక్టోబరు కాంట్రాక్టు గతవారం రూ.37,737 వద్ద ఆరంభమైనా, ఆ తర్వాత రూ.37,605కి పడిపోయింది. అమెరికా చర్యకు ప్రతిచర్యగా టారిఫ్‌లు పెంచాలని చైనా నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం కాంట్రాక్టు 2 శాతం మేర దూసుకెళ్లి రూ.38,821 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. చివరకు వారం మొత్తం మీద 2.84% లాభంతో రూ.38,880 వద్ద ముగిసింది. ఈవారం అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిణామాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వ్యాఖ్యలు, సాంకేతికత అంశాలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి. వాణిజ్య యుద్ధం ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో రూ.39,080 వరకు కాంట్రాక్టు వెళ్లేందుకు అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనల మేరకు కీలక స్థాయైన రూ.39,219ను కూడా అధిగమించొచ్చు. వెండి సెప్టెంబరు ఫ్యూచర్‌ కాంట్రాక్టు గతవారం రూ.43,552 వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత ఒడుదొడుకుల మధ్య చలిస్తూ రూ.43,154 స్థాయికి దిగివచ్చింది. వాణిజ్య యుద్ధ పరిణామాల నేపథ్యంలో పసిడి మాదిరే వెండి కాంట్రాక్టు కూడా ఆ తర్వాత రాణించి, రూ.44,627 స్థాయిని చేరింది. ఆఖరుకు 2.38% లాభంతో రూ.44,595 వద్ద స్థిరపడింది. సాంకేతికంగా కాంట్రాక్టు ఇప్పటికే మోతాదుకు మించి పెరిగినప్పటికీ.. రూ.43,800 వద్ద గట్టి మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయి కంటే కిందకు రానంత వరకు కాంట్రాక్టు పెరిగేందుకే అవకాశం ఉంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.44,611 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.43,875 దిగువన కాంట్రాక్టును షార్ట్‌సెల్‌ చేయొచ్చు. లాంగ్‌ పొజిషన్లుంటే రూ.45,598 వద్ద లాభాలు స్వీకరించడం మంచి వ్యూహం అవుతుంది.

ప్రాథమిక లోహాలు


రాగి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.448.85 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే.. మరింత కిందకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల స్టాప్‌లాస్‌ సవరిస్తూ షార్ట్‌సెల్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు. అలాగే రూ.445.65 దరిదాపులో మరికొన్ని పొజిషన్లు జతచేసుకోవచ్చు. సీసం నెల రోజులుగా రూ.148- 159.80 శ్రేణి మధ్య చలిస్తోంది. ఈవారం కూడా ఆ శ్రేణిలోనే కదలాడొచ్చు. రూ.158.85 కంటే పైన ట్రేడ్‌ కాకుంటే కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.152.65; రూ.150.35 వరకు పడిపోవచ్చు. జింక్‌ ఆగస్టు కాంట్రాక్టు ఇప్పటికే మోతాదు కంటే ఎక్కువగా నష్టపోయినప్పటికీ.. మరింత డీలాపడే ఆస్కారం ఉంది. అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రాణించొచ్చు. ఈవారం రూ.137.15 దరిదాపులో ముగిస్తే రానున్న రోజుల్లో రూ.142.85; రూ.144 వరకు పెరుగుతుందని భావించవచ్చు. నికెల్‌ ఆగస్టు కాంట్రాక్టు గత మూడు వారాలుగా నష్టాలు చవిచూస్తోంది. ఈవారం కూడా ఆ ధోరణి కొనసాగొచ్చు. అయితే కాంట్రాక్టు గడువు తీరిపోనున్న నేపథ్యంలో కొంత ఒడుదొడుకులకు లోనుకావచ్చు. 

ఇంధన రంగం

ముడి చమురు అక్టోబరు, సెప్టెంబరు కాంట్రాక్టులను రాబోయే రెండు మూడు వారాల్లో ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయొచ్చు. అమెరికా ఫెడ్‌ సమావేశం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం, ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల సరఫరా తగ్గుముఖం లాంటి భిన్న పరిణామాల నేపథ్యంలో ఈ వ్యూహంతో వెళ్లడమే మంచిది. అయితే రూ.3,593 వద్ద స్టాప్‌లాస్‌ తప్పక పెట్టుకోవాలి. సహజవాయువు సెప్టెంబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.160.35 వరకు లాంగ్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.562.75 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఎందుకంటే ఈ స్థాయి వద్ద కొంత షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకోవచ్చు. అందువల్ల గతవారం లాంగ్‌ పొజిషన్లు కొనసాగించే వాళ్లు ఈ స్థాయి వద్ద బయటపడటం మంచిది.

వ్యవసాయ ఉత్పత్తులు

గోరుచిక్కుడు అక్టోబరు కాంట్రాక్టు ఈ రోజు రూ.4,216 కంటే దిగువన ముగిస్తే.. అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ స్థాయి దిగువకు రానంతవరకు ప్రస్తుత లాంగ్‌ పొజిషన్లు కొనసాగించడం మంచిదే. సోయాబీన్‌ సెప్టెంబరు కాంట్రాక్టుకు ఈవారం సాంకేతికంగా రూ.3,927 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత ముందుకెళుతుందని భావించవచ్చు. జీలకర్ర సెప్టెంబరు కాంట్రాక్టుకు సాంకేతికంగా అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. అయితే రూ.16,643 దిగువన ట్రేడ్‌ కాకుంటే రాణించేందుకూ ఆస్కారం ఉంది. అందువల్ల ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లడం మంచిది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.