Eenadu Online Edition Business News - EENADU
close
బీఎస్‌-6 హోండా యాక్టివా

ధరల శ్రేణి రూ.67,490- 74,490

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలతో ‘యాక్టివా 125 సీసీ’ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.67,490-74,490. బీఎస్‌-4 మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త స్కూటర్ల ధరలు 10 శాతం అధికంగా ఉన్నాయి. అయితే, ఇంధన సామర్థ్యం మాత్రం గత మోడళ్లతో పోలిస్తే 13 శాతం పెరిగిందని సంస్థ పేర్కొంది. కొత్త యాక్టివాలను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేసి ఈ నెల 28 నుంచి వినియోగదార్లకు అందిస్తామని తెలిపింది. వీటిని మూడేళ్ల వారెంటీతో విక్రయించడంతో పాటు అదనంగా మరో మూడేళ్ల పాటు దాన్ని రెన్యువల్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హోండా వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.