close
అయిదు సంస్థలకు ఆస్ట్రేలియా అండ

ఈనాడు, హైదరాబాద్‌: వుయ్‌-హబ్‌ భాగస్వామ్యంతో చెన్నై లోని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌... మహిళా పారిశ్రామికవేత్తల సారథ్యంలోని అయిదు సంస్థలకు అండగా నిలిచింది. కాన్సులేట్‌ జనరల్‌ ప్రత్యక్ష సహాయ కార్యక్రమం కింద 30,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల (దాదాపు రూ.15 లక్షలు) ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సంస్థల్లో స్కేలప్‌ కన్సల్టెంట్స్‌, వూర్వి, అదిరో ల్యాబ్స్‌, సెల్లెరైట్‌, క్యాబ్‌దోస్త్‌ ఉన్నాయి. స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ అండ్‌ మ్యాథమ్యాటిక్స్‌) విభాగంలో దక్షిణ భారతదేశంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనేది తమ ప్రధానోద్దేశమని, తద్వారా ఈ విభాగంలో పురుషులు- మహిళల మధ్య అంతరాన్ని తగ్గించాలని భావిస్తున్నట్లు చెన్నైలోని ఆస్ట్రేలియన్‌ వైస్‌ కౌన్సెల్‌ ఆండ్రూ కోలిస్టెర్‌ పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.