close
ఒక వాయిదా మేమే కడతాం

సెల్‌ఫోన్‌ అమ్మకాల్లో సరికొత్త పంథా
ఉచిత బహుమతులకు అదనం
నేరుగా ఆన్‌లైన్‌లో వరాలిస్తున్న కంపెనీలు
మూడోవిడత విక్రయాలకు పోర్టళ్ల సన్నాహాలు
కొన్ని మోడళ్లపై భారీ రాయితీలు, నగదు వెనక్కి

ఈనాడు వాణిజ్య విభాగం

వాడుతున్న సెల్‌ఫోన్‌ను మార్చి, కొత్తది కొనేందుకు వినియోగదారులు సిద్ధపడేలా ఆన్‌లైన్‌ పోర్టళ్లు, విక్రయశాలలకు తోడు తయారీ కంపెనీలే ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి మొదలైన ఆఫర్ల సందడి దసరా పండుగకు తీవ్రమైంది. దసరా ముందు ఒకసారి, తరవాత మరోసారి పోర్టళ్లు రాయితీ విక్రయాలు నిర్వహించాయి. దీపావళికి మరోవిడత  21 నుంచి సేల్‌ ప్రారంభిస్తున్నట్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించాయి. ఇప్పుడు విక్రయశాలలు దూకుడు మరింత పెంచి, వడ్డీలేని సులభ వాయిదాలలో ఒక వాయిదా కూడా తామే చెల్లిస్తామని పేర్కొంటున్నాయి.

దసరా పండుగ సమయంలో సెల్‌ఫోన్లు, మన్నికైన వినియోగ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌ ఉత్పత్తుల వంటివి జోరుగా విక్రయమయ్యాయి. అన్నింటికంటే స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీలపై ఆఫర్లు అధికంగా ఉండగా, కొనుగోళ్లు కూడా అవే ఎక్కువ జరిగాయని సమాచారం. తొలివిడతలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 15 రెట్లు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు 5 రెట్లు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు 8 రెట్లు అధికంగా విక్రయమైనట్లు అమెజాన్‌ వెల్లడించింది. వివిధ బ్యాంకులతో కలిసి ఆన్‌లైన్‌ పోర్టళ్లు ఇచ్చిన ‘వడ్డీలేని సులభ వాయిదాలు (ఈఎంఐ), నగదు వెనక్కి (క్యాష్‌బ్యాక్‌), పాత వస్తువు మార్చి కొత్తది తీసుకోవడం (ఎక్స్ఛేంజ్‌)’ వంటి ఆఫర్లు వినియోగదారులను ముఖ్యంగా గ్రామీణులనూ విశేషంగా ఆకట్టుకున్నాయని గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. మూడోవంతు కొనుగోళ్లు ఈ పద్ధతిలోనే జరగడం గమనార్హం. దీపావళి సమీపిస్తుండటంతోపాటు, పలు కంపెనీలు ఇప్పుడు బోనస్‌లు ఇస్తాయి కనుక, మరో విడత విక్రయాలకు ఆన్‌లైన్‌ పోర్టళ్లు సన్నద్ధమవుతున్నాయి.
వివో, శామ్‌సంగ్‌, షియామీ వంటి కంపెనీలూ నేరుగా తమ పోర్టల్‌లో కొనుగోలు చేసేవారికి ధరల్లో రాయితీతో పాటు, బ్యాంక్‌ కార్డులపై నగదు వెనక్కి, ఒకసారి తెరను మార్చుకునే వీలు వంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. క్యాషిఫై వంటి సంస్థల సాయంతో ఎక్స్ఛేంజ్‌ సదుపాయాన్నీ కల్పిస్తున్నాయి. మోడల్‌ని బట్టి, విక్రయ ధరలో 50 శాతం వరకు కచ్చిత ధరకు తిరిగి కొనుగోలు చేస్తామనీ హామీలూ ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌ విక్రయాల వల్ల సంప్రదాయ విక్రయశాలల వ్యాపారం మూడోవంతు వరకు తగ్గినట్లు అంచనా. అయినా కూడా మొత్తం విక్రయాల్లో 60 శాతం వాటా సంప్రదాయ దుకాణాలకే ఉన్నందున, వీటికీ తమ వంతు సాయం అందించేందుకు తయారీ సంస్థలు; రుణ వ్యాపారం పెంచుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆన్‌లైన్‌కు ఇచ్చిన దాదాపు అన్ని మోడళ్లనూ, దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. అందువల్లే విక్రయశాలలు కూడా ఆన్‌లైన్‌ ధరలతో సమానంగా ప్రకటించడంతో పాటు ఉచిత బహుమతులు, రూ.15-20 వేలకు మించిన స్మార్ట్‌ఫోన్లను సులభ వాయిదాల్లో కొనుగోలు చేసుకుంటే, ఒక వాయిదా తామే చెల్లించే సదుపాయం కల్పిస్తున్నాయి. వివో, ఓపో, రియల్‌మి వంటి సంస్థలైతే వచ్చే జనవరి నుంచి ఆన్‌లైన్‌కే ప్రత్యేక మోడళ్లు ఇచ్చే విధానం ఆపేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

క్యాషిఫై సాయంతో మార్పిడి సదుపాయం కల్పిస్తోంది. మోడల్‌కు అనుగుణంగా మార్పిడిపై రూ.1000 రాయితీ, సెల్ఫీ స్టిక్‌ ఉచితం, 12 నెలల వరకు వడ్డీలేని సులభ వాయిదాల్లో కొనే అవకాశం తమ పోర్టల్‌లో కల్పిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై నగదు వెనక్కి సదుపాయమూ ఉంది.
షియామీ సంస్థ వెబ్‌సైట్‌లో ఈనెల 31 వరకు ఆఫర్లు ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌కార్డులపై 10%; గరిష్ఠంగా రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది.
దాదాపు అన్ని బ్యాంక్‌ కార్డులపై 6 నెలల వరకు వడ్డీలేని ఈఐఎంతో క్యాషిఫై ద్వారా పాత ఫోన్‌ మార్చుకొని కొత్తది కొనొచ్చు. ఏ, ఎస్‌ సిరీస్‌ ఫోన్లపై యూట్యూబ్‌ ప్రీమియం సర్వీసులు 6 నెలలు ఉచితం.
30 కార్లు, బైక్‌లు సహా రూ.7-8 కోట్ల విలువైన బహుమతులను బి ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. 35% వరకు కొనుగోళ్లు ఈఎంఐలపై ఉంటున్నందున.. తయారీ కంపెనీ, రుణ సంస్థల భాగస్వామ్యంలో ఒక వాయిదా తామే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. రూ.15000కు మించిన వివో, ఓపో కొన్ని మోడడళ్లపై బజాజ్‌ ఫైనాన్స్‌తో; శామ్‌సంగ్‌ కొన్ని మోడళ్లకు టీవీఎస్‌ ఫైనాన్స్‌ రుణం తీసుకునే వారికి ఈ సదుపాయం ఉన్నట్లు వివరించింది. వినియోగదారులు 3 ఈఎంఐలు చెల్లిస్తే, ఒకటి వారి ఖాతాకు క్రెడిట్‌ అవుతుంది. ఆధార్‌, చిరునామా ధ్రువీకరణ, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ఉన్న వారికి సిబిల్‌స్కోర్‌ ఆధారంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రతి కొనుగోలుపై బహుమతి అందించేందుకు రూ.5 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని, దీంతోపాటు వడ్డీలేని సులభ వాయిదాలు ఇస్తున్నామని ప్రకటించింది. రూ.20 వేలకు మించిన వివో, ఓపో, శామ్‌సంగ్‌, షియామీ స్మార్ట్‌ఫోన్లను 12 సులభ వాయిదాల్లో కొనుగోలు చేసుకుంటే, మొదటి ఈఎంఐ తాము తిరిగి చెల్లిస్తామని తెలిపింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ, హోమ్‌క్రెడిట్‌, హెచ్‌డీబీ, ఐసీఐసీఐ కన్జూమర్‌ ఫైనాన్స్‌ సంస్థలతో రుణం తీసుకున్న వారికి ఈ సదుపాయం ఉన్నట్లు వివరించింది.
3జీబీ, 32జీబీ మొబైల్‌తో 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.9,999కు, వాషింగ్‌ మెషీన్‌ను రూ.8,999కు అందిస్తోంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై 10%, పేటీఎం ద్వారా చెల్లింపులపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను అందిస్తోంది.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.