close
ఎయిరిండియాకు వచ్చే నెలలో బిడ్లు!

దిల్లీ: భారీ రుణ ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియా సంస్థలో 100 శాతం వాటా విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో ప్రాథమిక బిడ్లు ఆహ్వానించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ఆసక్తి వ్యక్తబరిచినట్లు తెలుస్తోంది. సుమారు రూ.58,000 కోట్ల రుణ భారం ఉన్న ఎయిరిండియాను విక్రయించేందుకు ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) పత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెలలో ప్రాథమిక బిడ్లను ఆహ్వానించబోతున్నట్లు తెలిసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఇ-బిడ్డింగ్‌ వ్యవస్థ ద్వారా ఈ బిడ్డింగ్‌ ప్రక్రియ జరగనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.