close
జామిసన్‌ వెల్‌నెస్‌ కార్పొరేషన్‌తో మెడ్‌ప్లస్‌ భాగస్వామ్యం

ఈనాడు, హైదరాబాద్‌: కెనడా సంస్థ అయిన జామిసన్‌ వెల్‌నెస్‌ కార్పొరేషన్‌తో దేశీయ ఫార్మసీ రిటైల్‌ చైన్‌ సేవల సంస్థ మెడ్‌ప్లస్‌ ప్రత్యేక పంపిణీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈ సంస్థకు చెందిన జామిసన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను మెడప్లస్‌ తన ఫార్మసీల్లో, ఆన్‌లైన్లో విక్రయిస్తుంది. జామిసన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. జామిసన్‌ బ్రాండుకు ఉన్న ఆదరణను పరిగణలోకి తీసుకొని ఈ సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తులను మనదేశంలో వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడ్‌ప్లస్‌ సీఈఓ మధుకర్‌ గంగాడి వివరించారు. మెడ్‌ప్లస్‌కు ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో 1700 ఔషధ విక్రయ కేంద్రాలున్నాయి. రోజువారీ మల్టీ విటమిన్లు, బీ-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి, విటమిన్‌-డి, కాల్షియం, కాడ్‌ లివర్‌ ఆయిల్‌, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ పలు రకాలైన ఎంజైమ్‌లను తాము ప్రపంచ మార్కెట్‌కు అందిస్తున్నట్లు జామిసన్‌ వెల్‌నెస్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ మార్క్‌ హార్నిక్‌ పేర్కొన్నారు. ఇకపై ఈ ఉత్పత్తులన్నీ మెడ్‌ప్లస్‌ విక్రయ కేంద్రాల ద్వారా భారతదేశంలో లభిస్తాయని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.