close
16 నెలల గరిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

అక్టోబరులో 4.62 శాతం

దిల్లీ: వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబరులో 4.62 శాతంగా నమోదైంది. ఇది 16 నెలల గరిష్ఠం కావడం గమనార్హం. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యం స్థాయిని అధిగమించింది. గత ఏడాది ఇదే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.38 శాతం కాగా, గత సెప్టెంబరులో ఇది 3.99 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.  2018 జూన్‌లో నమోదైన 4.92 శాతం తర్వాత ద్రవ్యోల్బణం మళ్లీ ఆ స్థాయికి చేరడం ఇదే. కేంద్ర గణక కార్యాలయం గణాంకాల ప్రకారం..
* ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.11% నుంచి 7.89 శాతానికి పెరిగింది.
* కూరగాయల ధరల ద్రవ్యోల్బణం 5.40 శాతం నుంచి 26.10 శాతానికి ఎగబాకింది. పండ్ల ధరల ద్రవ్యోల్బణం కూడా 0.83 శాతం నుంచి 4.08 శాతానికి చేరింది.
* తృణధాన్యాలు, మాంసం-చేపలు, గుడ్ల ధరలు కూడా వరుసగా 2.16%, 9.75%, 6.26% మేర పెరిగాయి.
* పప్పు ధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 11.72 శాతానికి పెరిగింది.
* ఇంధన ద్రవ్యోల్బణం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో -2.18 శాతం నమోదు కాగా, అక్టోబరులో -2.02 శాతానికి పరిమితమైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.