close
జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌ల గడువు పొడిగింపు

దిల్లీ: జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌ల (జీఎస్‌టీఆర్‌-9) గడువు తేదీని ప్రభుత్వం పొడిగించింది. 2017-18 సంవత్సరానికి రిటర్న్‌ దాఖలు నిమిత్తం డిసెంబరు 31 వరకు గడువును పెంచింది. 2018-19 ఆర్థిక సంవత్సరం రిటర్న్‌ల సమర్పణకు వచ్చే మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. సవరించిన గడువు తేదీలకు అనుగుణంగా రీకాన్సిలేషన్‌ స్టేట్‌మెంట్‌ (జీఎస్‌టీఆర్‌-9సీ) సమర్పణ గడువు కూడా ప్రభుత్వం మార్చింది. అలాగే వార్షిక రిటర్న్‌లు, రీకాన్షిలేషన్‌ స్టేట్‌మెంట్‌ ఫారంల సరళీకరణకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీబీఐసీ వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.