
దిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మూడున్నరేళ్ల కనిష్ఠానికి చేరింది. గత అక్టోబరులో 0.16 శాతంగా నమోదైంది. 2018 అక్టోబరులో ఇది 5.54 శాతం కాగా. ఈ ఏడాది సెప్టెంబరులో ఇది 0.33 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు ప్రియమైనా తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
* ఆహార వస్తువుల ధరలు 9.8 శాతం, ఆహారేతర వస్తువులు 2.35 శాతం మేర పెరిగాయి.
* బంగాళాదుంపల టోకు ద్రవ్యోల్బణం -19.60 శాతంగా నమోదైంది.
* కూరగాయల టోకు ద్రవ్యోల్బణం 19.43 శాతం నుంచి 38.91 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాల టోకు ద్రవ్యోల్బణం 17.94 శాతం నుంచి 16.57 శాతానికి తగ్గింది. పండ్ల ద్రవ్యోల్బణం 6.67 శాతం నుంచి 2.72 శాతానికి పరిమితమైంది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!