close
ఉద్యోగం ఓకే.. వేతనమే..!!

మెజార్టీ ఉద్యోగుల అభిప్రాయమిదే
మాన్‌స్టర్‌ సర్వే

ముంబయి: కూటి కోసమే కోటి విద్యలంటారు. ఎవరైనా ఉద్యోగం చేసేది వేతనం కోసమే కదా. తాము చేస్తున్న ఉద్యోగం విషయంలో సంతృప్తిగా ఉన్నట్లు చాలా మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. అయితే వేతనంపై మాత్రం సంతోషంగా లేమని పేర్కొన్నారు. మాన్‌స్టర్‌ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 2016 జనవరి నుంచి 2018 డిసెంబరు మధ్య మూడేళ్ల మధ్య అంశాలను క్రోడికరించి నివేదిక తయారు చేశారు. ఆ వివరాలు ఇలా..

* ఉద్యోగం సంతృప్తికరంగానే ఉందని సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది చెప్పారు. వేతన సంతృప్తి సూచీ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. 21.6 శాతానికి దిగివచ్చినట్లు సర్వే పేర్కొంది.

* సహ ఉద్యోగులు, అధికారులతో సంబంధాల పట్ల ఉద్యోగులు చాలా ఆనందôగా ఉన్నారు. 2018లో ఇవి వరుసగా 92 శాతం, 87 శాతం చొప్పున ఉన్నాయి.

* నిర్మాణం, టెక్నికల్‌ కన్సల్టెన్సీ, ఆరోగ్య సంరక్షణ సేవలు, సామాజిక సేవ, ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సేవలు, న్యాయ, మార్కెట్‌ కన్సల్టెన్సీ, బిజినెస్‌ కార్యకలాపాల రంగాల్లోని ఉద్యోగులు అధిక సంతృప్తితో ఉన్నారు.

* ఉద్యోగ సంతృప్తిలో న్యాయ, మార్కెట్‌ కన్సల్టెన్సీ రంగాల ఉద్యోగులు 84 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. నిర్మాణం, టెక్నికల్‌ కన్సల్టెన్సీ ఉద్యోగులు 83 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచారు.

* 2017తో పోలిస్తే ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సేవలందించే ఉద్యోగుల సంతృప్తి 3 శాతం వృద్ధి చెంది 75 శాతానికి చేరింది. విద్య, పరిశోధన విభాగం 73 శాతం నుంచి 53 శాతానికి పడిపోయింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.