
వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ నష్టాలు రూ.74,000 కోట్లు
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.50,921 కోట్ల భారీ నష్టాన్ని వొడాఫోన్ ఐడియా నమోదు చేసింది. దేశీయంగా మరే సంస్థా ఒక త్రైమాసికంలో నమోదు చేయనంత భారీ నష్టమిది. 2018-19 ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.4874 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం రూ.7878.6 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.11,146.4 కోట్లకు చేరడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం రూ.44,150 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.25,680 కోట్లు ఈ త్రైమాసికంలో కేటాయించినట్లు సంస్థ తెలిపింది. నెట్వర్క్ 3జీ నుంచి 4జీ సాంకేతికతకు మారడం వల్ల, వినియోగించని కొన్ని ఆస్తుల రూపేణ రూ.4,822 కోట్లు కేటాయించింది.
* 2018 డిసెంబరు త్రైమాసికానికి టాటా మోటార్స్ ప్రకటించిన రూ.26,961 కోట్ల నష్టమే ఇప్పటివరకు అధిక నష్టంగా నమోదైంది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా దానికి దాదాపు రెట్టింపు నష్టాన్ని ప్రకటించడం గమనార్హం.
రివ్యూ పిటిషన్ వేస్తున్నాం: ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఏమీ రాకపోతే దేశీయ విపణిలో మనగలుగుతామా అనే సందేహాన్ని వొడాఫోన్ ఐడియా వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం నుంచి లభిస్తుందని ఆశిస్తున్న ఊరటపైనే మా మనుగడ ఆధారపడి ఉంటుంది. సానుకూల నిర్ణయం లభిస్తుందనే భావిస్తున్నాం’ అని సంస్థ పేర్కొంది.
సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రూ.వేల కోట్ల కేటాయింపులు జరపాల్సి రావడంతో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు సెప్టెంబరు త్రైమాసికానికి అత్యంత భారీ నష్టాలు నమోదు చేశాయి.
వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో జీవనకాల కనిష్ఠమైన రూ.2.90కి చేరినా, చివరకు రూ.2.95కు చేరింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!