
‘ప్లేస్మెంట్’లలో ఐఎస్బీ హైదరాబాద్ ఘనత
నియామకాల కోసం 231 కంపెనీల రాక
పీజీపీ విద్యార్థులకు 1383 ఉద్యోగ ఆఫర్లు
ఈనాడు - హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్ధులకు ఈసారి ‘కేంపస్ ప్లేస్మెంట్’లో ఆసక్తికరమైన ఉద్యోగాలు, వేతనాలు లభించాయి. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) 2020 బ్యాచ్‌లోని దాదాపు 870 మంది విద్యార్ధులకు ప్లేస్మెంట్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకూ 231 కంపెనీలు ప్లేస్మెంట్ కోసం రాగా, మొత్తం 1383 ఉద్యోగ ఆఫర్లు విద్యార్థులకు లభించాయి. ఈ ఆఫర్ల ప్రకారం పీజీపీ విద్యార్థులకు లభించే సగటు వార్షిక వేతన రూ.26.15 లక్షలు. క్రితం ఏడాదితో పోలిస్తే వార్షిక సగటు వేతనం, ఉద్యోగ ఆఫర్లు ఈసారి ఎంతో అధికంగా ఉన్నట్లు ఐఎస్బీ వెల్లడించింది.
‘ప్లేస్మెంట్’ ప్రత్యేకతలు
* కన్సల్టింగ్, ఐటీ/ ఐటీఈఎస్/ టెక్నాలజీ, ఇ-కామర్స్, బీఎఫ్సీఐ, ఎఫ్ఎంసీజీ/ రిటైల్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఉద్యోగావకాశాలు ఇచ్చాయి.
* ఈసారి పీజీపీ విద్యార్థులకు కన్సల్టింగ్ కంపెనీలు అత్యధికంగా 314 ఉద్యోగాలు ఇచ్చాయి. వాటిలో- యాక్సెంచర్, అల్వరాజ్ అండ్ మార్సల్, ఏటీ కెర్నీ, బెయిన్ అండ్ కంపెనీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, డాల్బెర్గ్, డెలాయిట్ ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ. తదితర కంపెనీలు ఉన్నాయి.
* ఐటీ/ ఐటీఈఎస్/ టెక్నాలజీ విభాగానికి చెందిన కంపెనీల్లో ఏడీపీ, అమెజాన్, బ్లాక్‌బక్, బైజూస్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, మీడియా నెస్ట్, ఎంఫిన్, మైక్రోసాఫ్ట్, మైంత్ర, నైకా, ఓలా, పేసేఫ్, ఫోన్‌పే, రేజర్‌పే, ఉబర్, వీఎంవేర్, జొమాటో ఉన్నాయి.
* యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, క్రెడిట్ సూయిజ్, ఎస్టీ అడ్వైజర్స్, ఐసీఐసీఐ బ్యాంకు, మాట్రిక్స్ పార్టనర్స్, యెస్ బ్యాంకు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బార్క్లేస్, కింగ్‌ఫిష్ ప్రైవేట్ ఈక్విటీ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వెల్ఫార్గో వంటి బీఎప్సీఐ విభాగానికి చెందిన సంస్థలు ఆకర్షణీయ ఉద్యోగాలు, వేతనాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
* మొత్తం ఉద్యోగ ఆఫర్లలో కన్సల్టింగ్ కంపెనీలు ఇచ్చినవి 22.75 శాతం కాగా, ఐటీ-ఐటీఈఎస్ 14.93 శాతం, ఈ-కామర్స్ 11.30, బ్యాంకులు- ఆర్థిక సంస్థలు 11.23 శాతం ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి.
విద్యార్థినులకు అధిక ఉద్యోగాలు
పీజీపీ 2020 బ్యాచ్‌లోని విద్యార్థినులకు ఈసారి అధికంగా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. యాక్సిస్ బ్యాంకు ఎక్కువ మంది విద్యార్థినులను తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుత బ్యాచ్‌లో అత్యధికంగా 39 శాతం మంది విద్యార్థినులు ఉన్నట్లు ఐఎస్బీ వెల్లడించింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు