close

ప్రధానాంశాలు

మార్కెట్‌ కబుర్లు

* ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సైబర్‌ డిఫెన్స్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు విప్రో ప్రకటించింది. త్వరలోనే ఇతర నగరాల్లో సైతం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.
* కాలేయ వ్యాధి చికిత్సలో వినియోగించే సరోగ్లిటాజర్‌ మెగ్నిషీయం ఔషధానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) దగ్గర కొత్త ఔషధ దరఖాస్తును జైడస్‌ క్యాడిలా దాఖలు చేసింది.
* మేరు ట్రావెల్‌ సొల్యూషన్స్‌లో 36.63 శాతం వాటా కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. కంపెనీ మొత్తం 55 శాతం వాటాను రూ.201.5 కోట్లకు దక్కించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
* గ్లోబల్‌ క్లౌడ్‌ ఎక్స్ఛేంజీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది. ఫలితంగా దివాలా ప్రక్రియ పూర్తి చేసి, స్వతంత్ర సంస్థగా ఏర్పడటానికి మార్గం సుగమమైంది. ఆర్‌కామ్‌కు గ్లోబల్‌ క్లౌడ్‌ ఎక్స్ఛేంజీ అనుబంధ సంస్థగా ఉండేది.
* గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ వైస్‌ ఛైర్మన్‌, బోర్డు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా హిమాన్షు కపానియా వైదొలిగారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌లోనే వేరే పదవిని చేపట్టనున్నారు.
* కెన్యా రాజధాని నైరోబీలో 130 పడకాల ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను నారాయణ హృదయాలయ విరమించుకుంది. ఆఫ్రికా హెల్త్‌ ఫండ్‌ నిధులు ఇవ్వడానికి నిరాకరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.