close

ప్రధానాంశాలు

ఈ ఏడాదిలో మరో 2 మోడళ్లు: కియా

హైదరాబాద్‌: భారత్‌లో వరుసగా కొత్త మోడల్‌ కార్లు విడుదల చేయడానికి కియా మోటార్స్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న 3 లక్షల కార్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని.. 2022 మార్చికి పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు కియా మోటార్స్‌ ఇండియా హెడ్‌ (మార్కెటింగ్‌, అమ్మకాలు) మనోహర్‌ భట్‌ వెల్లడించారు. సెల్టోస్‌తో మంచి ఆరంభం సాధించిన కంపెనీ, ఈ ఏడాది రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. దిల్లీ వాహన ప్రదర్శనలో కియా లగ్జరీ మల్టీ పర్పస్‌ వెహికల్‌ కార్నివాల్‌ను ప్రదర్శించనుంది. ఒక కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ను ఈ ఏడాదిలోనే తీసుకురానుంది. వచ్చే ఏడాది కూడా రెండు ఉత్పత్తులను విడుదల చేస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్‌లో మూడు షిఫ్ట్‌ల పద్ధతిన ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయొచ్చు. ప్రస్తుతం ఇక్కడ రెండు షిఫ్ట్‌ల్లోనే పని జరుగుతోంది. కార్నివాల్‌ మోడల్‌లో 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ అమర్చామని, లీటర్‌కు 13.9 కి.మీ మైలేజీ ఇస్తుందని భట్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.