close

ప్రధానాంశాలు

బీఎస్‌-6 మారుతీ వ్యాగన్‌ఆర్‌ సీఎన్‌జీ

దిల్లీ: బీఎస్‌-6 ప్రమాణాలతో వ్యాగన్‌ఆర్‌ సీఎన్‌జీ వేరియంట్‌ను మారుతీ సుజుకీ తీసుకొచ్చింది. రెండు రకాల్లో ఇది లభ్యం కనుంది. ఎల్‌ఎక్స్‌ఐ ధర రూ.5.25 లక్షలు, ఎల్‌ఎక్స్‌ఐ(ఓ) రూ.5.32 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ). బీఎస్‌-6 ప్రమాణాలతో కంపెనీ తీసుకొచ్చిన మూడో సీఎన్‌జీ వేరియంట్‌ ఇది. దీని ఇంధన ట్యాంకు కెపాసిటీ 60 లీటర్లు కాగా.. మైలేజీ 32.52 కి.మీలు/కేజీ.

హీరో స్పెండ్లర్‌ ప్లస్‌ కూడా..: హీరో మోటోకార్ప్‌ తన స్పెండ్లర్‌ ప్లస్‌ మోటర్‌ సైకిల్‌ను బీఎస్‌-6 ఇంజిన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర రూ.59,600 (ఎక్స్‌షోరూం, దిల్లీ). ఇదే కాకుండా మరో రెండు స్కూటరు మోడళ్లు డెస్టిని 125, మ్యాస్ట్రో ఎడ్జ్‌ను బీఎస్‌-6 వెర్లన్లో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.64,310; రూ.67,950 (ఎక్స్‌షోరూం, దిల్లీ).

బీఎస్‌-4 వాహనాల విక్రయ గడువును పెంచబోం: భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-4 ఇంజిన్‌తో కూడిన వాహనాల విక్రయాల గడువును పెంచబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విక్రయాల గడువును పెంచాలని కోరుతూ వాహన డీలర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.