close

ప్రధానాంశాలు

‘ఎగుమతి, దిగుమతి’ సమస్యలకు హెల్ప్‌డెస్క్‌

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎగుమతి, దిగుమతి ఆధారిత సమస్యలను పరిష్కరించడానికి హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఈ విభాగాన్ని నిర్వహించనుంది. వాణిజ్య శాఖ, డీజీఎఫ్‌టీకి సంబంధించిన అంశాలపై హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే డీజీఎఫ్‌టీఈడీఐ ఎట్‌ ఎన్‌ఐసీ డాట్‌ ఇన్‌కు మెయిల్‌ పంపించవచ్చు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-111-550 కు ఎగుమతిదార్లు, దిగుమతిదార్లు ఫోన్‌ చేయొచ్చని వాణిజ్య శాఖ వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.