close

ప్రధానాంశాలు

వెండికి అమ్మకాల ఒత్తిడి

బంగారం

పసిడి శుద్ధి కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేస్తుండటంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే పెట్టుబడులు కొనసాగే అవకాశం ఉంది. పసిడి కాంట్రాక్టుకు రూ.44,800- 45,547 మధ్య నిరోధం ఎదురుకావొచ్చు. ఒడుదొడుకుల నేపథ్యంలో, దిద్దుబాటుకు కూడా ఆస్కారం ఉంటుంది. అందువల్ల రూ.38,665ను స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడింగ్‌ చేయాలి.


వెండి

వెండి మే కాంట్రాక్టుకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఈ రోజు రూ.38,297 కంటే కిందకు వస్తే రూ.37,089 వరకు పడిపోయే అవకాశం ఉంది. అయితే ఈ స్థాయికి దిగివచ్చాక కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిది. అలాగే ధర తగ్గినప్పుడల్లా కాంట్రాక్టును కొనుగోలు చేసే వ్యూహంతోనూ ముందుకెళ్లొచ్చు.


ప్రాథమిక లోహాలు

* రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.364 ఎగువన నిలదొక్కుకుంటేనే రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ స్థాయికి దిగువన కదలాడితే మాత్రం కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది.
* సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం అమ్మకాల ఒత్తిడితో రూ.128.45; ఆ తర్వాత రూ.123 వరకు కూడా పడిపోవచ్చు. ఆ స్థాయికి దిగివచ్చాక కొనుగోలు చేయొచ్చు.
* జింక్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.135.05 ఎగువన నిలదొక్కుకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. రూ.132.15 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని, పడినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమం.
* అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.131.65 కంటే కింద చలించకుంటే కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు.
* నికెల్‌ మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.833.85 కంటే దిగువన చలించకుంటే రూ.888; రూ.916.55 వరకు పెరిగే అవకాశం ఉంది.


ఇంధన రంగం

* ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు బలహీనతలు ఈవారం కూడా కొనసాగొచ్చు. పలు దేశాలు ప్రకటించిన ఉద్దీపన చర్యలతో గిరాకీ భయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.  రష్యా, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం కుదిరితే రూ.1,897; రూ.2,091 వరకు పెరుగుతుందని భావించవచ్చు. రూ.1,596 దరిదాపుల్లో కొనుగోలు చేయడం మంచి వ్యూహమవుతుంది.
* సహజవాయువు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.118.15 కంటే కిందకు రాకుంటే రూ.136.25; రూ.142 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
* ముడి పామోలిన్‌ నూనె ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.656 ఎగువకు వెళ్తే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టును ఈవారం రూ.5,638 నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు.
* జీలకర్ర ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.13,870 దరిదాపుల్లో కొనుగోలు చేయొచ్చు. రూ.15,080 వరకు వెళ్లే అవకాశం ఉంది.
* పత్తి మే కాంట్రాక్టు రూ.2,143 చేరితే లాభాల స్వీకరించడం ఉత్తమం.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.