close

ప్రధానాంశాలు

పెట్టుబడులను ఆకర్షించటానికి ‘టీఎస్‌-ఐపాస్‌’ను అనుసరించాలి

కోటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేష్‌ షా

ఈనాడు, హైదరాబాద్‌: చైనా నుంచి బయటకు వచ్చే ఆలోచనతో ఉన్న బహుళ జాతి కంపెనీలను మనదేశానికి ఆకర్షించటానికి ఆన్‌లైన్లో సత్వరం అనుమతులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని కోటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేష్‌ షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టీఎస్‌-ఐపాస్‌’ పద్ధతిని అనుసరించాలని సూచించారు. స్వయం ధ్రువీకరణ ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక అనుమతులను 15 రోజుల్లోనే ఇవ్వాలని వివరించారు. ‘కొవిడ్‌- 19, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించటం’ అనే అంశంపై తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) నిర్వహించిన ‘వెబినార్‌’ లో ఆయన మాట్లాడారు. కొవిడ్‌-19 వల్ల కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలంటే ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్దీపన పథకాలపరంగా పూర్తి  భిన్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.