close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
350 చైనా ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుందాం

ఈనాడు, దిల్లీ: చైనా దిగుమతులను తగ్గించుకోవడంపై భారత్‌ దృష్టి పెట్టింది. చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులను అత్యవసరాలు, అత్యవసరం కాని వస్తువులుగా కేంద్ర వాణిజ్య శాఖ విభజించింది. దాదాపు 30 శాతం చైనా దిగుమతులు అత్యవసరం కాని వస్తువుల విభాగంలోకి వచ్చాయి. మొత్తం ఈ విభాగంలో 350 వస్తువులు ఉన్నాయి. భారత్‌లో ప్రతి ఏటా రూ.30 కోట్ల విలువైన అగరుబత్తీలను చైనా విక్రయించడం గమనార్హం. ఐ-లైనర్లు, పలు సాధారణ సౌందర్య ఉత్పత్తులు, సైకిల్‌ విడిభాగాలు, క్యాండిళ్లు చైనా నుంచి అధికంగా దిగుమతి అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యవసరం కాని వస్తువుల తయారీదార్లతో కేంద్ర వాణిజ్య శాఖ, ఎంఎస్‌ఎంఈ శాఖలు త్వరలోనే సమావేశం కానున్నట్లు సమాచారం. పోటీ ధరలకే ఈ 350 ఉత్పత్తులను దేశీయంగా ఎలా తయారుచేయాలి అన్నదానిపై ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.