close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిఫ్టీ 50 నుంచి వేదాంతా తొలగింపు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు చోటు

దిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ-50 నుంచి వేదాంతాను తొలగించనున్నారు. దాని స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పేరును చేర్చనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను స్వచ్ఛందంగా తొలగించేందుకు వేదాంతా నిర్ణయం తీసుకోవడంతో నిఫ్టీ-50 సూచీలో ఈ మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. వివిధ సూచీల్లో వేదాంతా స్థానంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ రానుంది. లోహ సూచీలోనూ వేదాంతా స్థానాన్ని మిధానీ భర్తీ చేయనుంది. సూచీల్లో ఈ మార్పు చేర్పులన్నీ జులై 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.