close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎడెల్‌వైజ్‌ గ్రూప్‌ నష్టం రూ.2245 కోట్లు

ముంబయి: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.2245 కోట్ల నష్టాన్ని ఎడెల్‌వైజ్‌ గ్రూప్‌ నమోదు చేసింది. కొవిడ్‌-19 సంక్షోభం వల్ల నష్టాలు అధికంగా ఉంటాయనే భావనతో, ముందస్తు కేటాయింపులు రూ.900 కోట్లు అధికంగా (మొత్తం రూ.2549 కోట్లు) జరపడమే ఇందుకు కారణం. 2018-19 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.232 కోట్లు కావడం గమనార్హం. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఆదాయం రూ.9603 కోట్లకు తగ్గింది. 2018-19లో ఈ మొత్తం రూ.11,161 కోట్లు. ఇదే సమయంలో నికరలాభం రూ.995 కోట్ల నుంచి నికరనష్టం రూ.2045 కోట్లకు క్షీణించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.