close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
36500- 37000 శ్రేణిలో నిరోధం

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలవడంతో గత వారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ వృద్ధిపై ఆశలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అంచనాలకు ముందే రావొచ్చన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి. భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, దేశీయంగా కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించినప్పటికీ.. ఆర్థిక కార్యకలాపాల రికవరీ లాభాలు తెచ్చిపెట్టింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.4 శాతం లాభంతో 36,021 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2.2 శాతం పెరిగి 10,607 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, బ్యాంకింగ్‌, చమురు- గ్యాస్‌ షేర్లు పరుగులు తీశాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాల స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.5,333 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు, ఫండ్ల కొనుగోళ్లు రూ.5041 కోట్లుగా నమోదయ్యాయి. జులైలో మొదటి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.3,741 కోట్లు ఉపసంహరించుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:8గా నమోదు కావడం..
మార్కెట్లలో కొంత లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా: వరుసగా మూడో వారం సెన్సెక్స్‌ లాభపడింది. కీలకమైన 36,000 పాయింట్ల ఎగువన ముగియడంతో ప్రస్తుత ర్యాలీ స్వల్పకాలంలో 36500- 37000 పాయింట్ల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ సెన్సెక్స్‌ 35,700 పాయింట్ల దిగువకు చేరితే.. సమీపకాలంలో దిద్దుబాటు లేదా స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, సాధారణ వర్షపాతం నమోదు కావడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడింది. అయితే దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లకు దిద్దుబాటు వచ్చినా, భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగినా ప్రస్తుత సెంటిమెంట్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారమే విడుదల కానున్నాయి. వర్షపాతానికి సంబంధించిన వార్తలూ కీలకమే.. అంతర్జాతీయంగా చూస్తే.. కొన్ని దేశాల్లో మళ్లీ షట్‌డౌన్‌ ప్రకటించడం అప్రమత్తతకు దారితీయొచ్చు. వ్యాక్సిన్‌ వార్తలు ర్యాలీకి తోడ్పాటు అందించనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగితే మార్కెట్‌ లాభాలకు అడ్డుకట్ట పడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయిలు: 35,595, 34,812, 34,136;
తక్షణ నిరోధ స్థాయిలు: 36,500, 37,000, 37,576

సెన్సెక్స్‌కు 36500- 37000 పాయింట్ల శ్రేణిలో బలమైన నిరోధం ఎదురుకావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.