close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పసిడి రాణింపు!

కమొడిటీస్‌ ఈవారం

బంగారం

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రాణించే అవకాశం ఉంది. ఇప్పటికే మోతాదుకు మించి కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ.. సానుకూలంగానే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుండటమే ఇందుకు కారణం. రూ.48,514 కంటే కిందకు వస్తేనే పసిడి కాంట్రాక్టు దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.


వెండి

వెండి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.48,141 కంటే కిందకు వస్తే రూ.47,563; రూ.46,558 వరకు పడిపోవచ్చు. ఒకవేళ రూ.48,141 కంటే పైన కదలాడితే రూ.51,188; రూ.51,736 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.50,522 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.50,004 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచిది.


ప్రాథమిక లోహాలు

* రాగి జులై కాంట్రాక్టు ఈవారం రూ.466.85 ఎగువకు వెళ్లకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలో రూ.466.85 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.461- రూ.464.85 మధ్య కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మేలే.
సీసం జులై కాంట్రాక్టు ఈవారం రూ.148.15 కంటే పైకి వెళ్లకుంటే రూ.135.75కి దిగివచ్చే అవకాశం ఉంది.  
జింక్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.166.35 స్థాయికి పైన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.
అల్యూమినియం జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.138.25 వద్ద కొంత నిరోధం ఎదురుకావచ్చు. అందువల్ల ధర పెరిగినప్పుడల్లా అమ్మే వ్యూహంతో ముందుకు వెళ్లడం మంచిది.
నికెల్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.988.25 కంటే పైనా చలించకుంటే రూ.955; రూ.949 వరకు పడిపోయే అవకాశం ఉంది.
ముడి చమురు జులై కాంట్రాక్టు ఈవారం రూ.3,124 కంటే పైన నిలదొక్కుకోకుంటే అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.2,819 వరకు దిగిరావచ్చు.


ఇంధన రంగం

సహజ వాయువు జులై కాంట్రాక్టు ఈవారం రూ.125.20 దిగువకు వస్తే రూ.117.35 స్థాయికి పడిపోవచ్చు. ఒకవేళ రూ.134 ఎగువన కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయదలిస్తే రూ.138.95 వద్ద స్టాప్‌లాస్‌ తప్పక పెట్టుకోవాలి.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జులై కాంట్రాక్టు ఈవారం రూ.663.35 స్థాయి కంటే కిందకు వస్తే రూ.648.85; రూ.637.35 వరకు దిద్దుబాటు అయ్యేందుకు ఆస్కారం ఉంది.  


వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు జులై కాంట్రాక్టును రూ.5,774, రూ.5,874 లక్ష్యంతో రూ.5,365- 5,418 మధ్య కొనుగోలు చేయొచ్చు. రూ.5,226 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
జీలకర్ర జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.13,963- 14,027 లక్ష్యంతో రూ.13,592- 13,663 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవాలి. అయితే రూ.13,521 వద్ద స్టాప్‌లాస్‌ పరిగణించాలి.
సోయాబీన్‌ జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.3,844 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.3,735- రూ.3,811 మధ్య షార్ట్‌సెల్‌ చేయొచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.