close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హోండా బీఎస్‌-6 ఎక్స్‌-బ్లేడ్‌

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 160సీసీ మోటార్‌సైకిల్‌ ఎక్స్‌-బ్లేడ్‌లో బీఎస్‌-6 వెర్షన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.1,05,325 (ఎక్స్‌-షోరూమ్‌ నోయిడా). 160సీసీ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బైకును బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు లోబడి రూపొందించారు. ఎక్కువ పనితీరు అందించేందుకు వీలుగా 8 ఆన్‌బోర్డు సెన్సార్లు నిరంతరం ఫ్యూయల్‌, ఎయిర్‌ మిక్సర్‌ను పంపిస్తాయి. కొత్త హోండా ఎక్స్‌-బ్లేడ్‌ బీఎస్‌-6 వెర్షన్‌లో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌) ఉంది. యువత కోసం కొత్త ఎక్స్‌-బ్లేడ్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్‌ (అమ్మకాలు, మార్కెటింగ్‌) యద్వీంధర్‌ సింగ్‌ గులేరియా పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.