close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యాక్సిన్‌ రాకపోతే -7.5 శాతం!

ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటుపై బీఓఎఫ్‌ఏ అంచనా

ముంబయి: కొవిడ్‌-19 నిరోధానికి వ్యాక్సిన్‌ కనుక ఏడాది పాటు రాకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం క్షీణించవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బీఓఎఫ్‌ఏ) విశ్లేషకులు అంచనా వేశారు. పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారితే, జీడీపీ -5 శాతం క్షీణించవచ్చని గతంలో అంచనా వేయగా, తాజాగా మరింత పెంచారు.  లాక్‌డౌన్‌ను ఒక నెల పాటు పొడిగిస్తే, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటుపై 1 శాతం మేర ప్రభావం పడుతోందని వివరించారు. అన్‌లాక్‌ తరవాత కొవిడ్‌ కేసుల సంఖ్య మూడింతలైనందున, లాక్‌డౌన్‌ షరతులను సెప్టెంబరు మధ్యవరకు పొడిగించవచ్చని, అక్టోబరు మధ్యలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ఆరంభం కావచ్చని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో 2 శాతం మేర రేట్లకోత విధించవచ్చని అంచనా వేశారు. మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు బాగా తగ్గినందున, భారత వాస్తవ జీడీపీ -4 శాతంగా నమోదయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.