close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బయోకాన్‌ ‘ఇతోలిజుమాబ్‌’ ఇంజెక్షన్‌ ధర రూ.7,950

కొవిడ్‌-19తో ఊపిరి తీసుకోలేని వారికి అనువైన ఔషధం
కిరణ్‌ మజుందార్‌ షా వెల్లడి 4 సార్లు ఇవ్వాలి

ఈ ఇంజెక్షన్‌ను రోగికి నాలుగు సార్లు ఐవీ (ఇంట్రావెనస్‌) ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.7,950 అయినందున, నాలుగు ఇంజక్షన్లకు రూ.32,000 ఖర్చు అవుతుంది. దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఈ ఇంజెక్షన్‌ అందించేందుకు ఉత్పత్తిని పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. బెంగుళూరులోని బయోకాన్‌ పార్కులో గల బయో-మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లో దీన్ని తయారు చేస్తున్నారు.  
ఈనాడు, హైదరాబాద్‌: ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి కొవిడ్‌- 19 వ్యాధితో బాధపడుతున్న వారి కోసం  ‘ఇతోలిజుమాబ్‌’ ఇంజెక్షన్‌ విడుదల చేయనున్నట్లు బయోకాన్‌ వెల్లడించింది. ఒక్కో వయల్‌కు రూ.7,950 ధర నిర్ణయించింది. కొవిడ్‌- 19 వల్ల ఊపిరి తీసుకోవటంలో తీవ్రంగా ఇబ్బందులు పడే వారికి (ఏఆర్‌డీఎస్‌- యాక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌), తప్పనిసరి పరిస్థితుల్లో ఇతోలిజుమాబ్‌ 25ఎంజీ/ 5ఎంఎల్‌ ఇంజక్షన్‌ ఇచ్చేందుకు బయోకాన్‌కు ఇటీవల డీసీజీఐ (డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంఇయా) నుంచి అనుమతి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి అనుమతి గల ఔషధం ఇదొక్కటేనని బయోకాన్‌ పేర్కొంది. ‘‘కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ కనుగొనే వరకూ రోగుల ప్రాణాలు కాపాడే మందులు అవసరం. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న ఔషధాలకు మార్పులు చేసి కొవిడ్‌- 19 బాధితులపై పనిచేసే ఔషధంగా మార్చడం లేదా కొత్త ఔషధాలు కనుగొనటమే మార్గం.’’ అని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా వివరించారు. ఈ ఏడాది చివరికో లేక వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ, కొవిడ్‌-19 తిరగబెట్టదనే గ్యారెంటీ ఏదీ లేదని, వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది... అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయ ఔషధాలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.