close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆన్‌లైన్‌లో పాలసీల జారీకి జీవిత బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ అనుమతి

దిల్లీ: జీవిత బీమా సంస్థలు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో జీవిత బీమా పాలసీలను జారీ చేసేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీ పత్రం, ప్రతిపాదన ఫారం కాపీని భౌతికంగా అందించడం వంటి కొన్ని నిబంధనల నుంచి జీవిత బీమా కంపెనీలకు మినహాయింపులు ఇస్తూ ఐఆర్‌డీఏఐ సర్క్యూలర్‌ జారీ చేసింది. ఈ మినహాయింపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసే అన్ని పాలసీలకు వర్తిస్తుందని తెలిపింది. పాలసీ పత్రాల ముద్రణ, చేరవేయడంలో ఇబ్బందులను వెల్లడిస్తూ జీవిత బీమా సంస్థలు అభ్యర్థనలు పంపడంతో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.