close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆదిత్య పురి వారసుడు..శశిధర్‌ జగదీశన్‌

● హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా నియామకానికి ఆర్‌బీఐ ఆమోదముద్ర

దిల్లీ: ఆదిత్య పురి వారసుడిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పగ్గాలు ఎవరు చేపడతారనే ఉత్కంఠకు తెరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా శశిధర్‌ జగదీశన్‌ పేరు ఖరారైంది. అక్టోబరు 27 నుంచి మూడేళ్ల పాటు ఆయన నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదముద్ర వేసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వ్యవస్థాపితమైన నాటి నుంచి 25 ఏళ్లకు పైగా ఆదిత్య పురి బ్యాంకుకు సేవలు అందిస్తూ వస్తున్నారు. అక్టోబరు 26న ఆయన పదవీ కాలం ముగుస్తుంది. పురి నేతృత్వంలో.. అత్యంత విలువైన భారతీయ ప్రైవేటు బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిలిచింది. సోమవారం సాయంత్రం పంపిన మూడు పేర్లలో బ్యాంకు బోర్డుకు తొలి ప్రాధాన్యంగా జగదీశన్‌ పేరు వైపు ఆర్‌బీఐ మొగ్గు చూపిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగదీశన్‌ నియమాకాన్ని ర్యాటిఫై చేసేందుకు బోర్డు సమావేశం నిర్వహిస్తామని ఎక్స్ఛేంజీలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలియజేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో శశిధర్‌ ప్రయాణం 1996లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆర్థిక, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్‌, పరిపాలనా, మౌలిక వసతులు, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌, కార్పొరేట్‌, సామాజిక విభాగాలకు సారథ్యం వహిస్తూనే.. స్ట్రాటజిక్‌ ఛేంజ్‌ ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.