close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సానుకూల సంకేతాలు

ఆర్థిక సేవల షేర్ల చేయూత
జూన్‌ త్రైమాసిక ఫలితాలు కీలకం
ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫార్మా షేర్లకు సానుకూలతలు
ఐటీ షేర్లకు ప్రతికూలతలు
విశ్లేషకుల అంచనాలు

ఈ వారం మన స్టాక్‌ మార్కెట్లు రాణించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సేవల షేర్లు ముందుండి మార్కెట్‌ను నడిపిస్తాయని, నిఫ్టీ 11400 పాయింట్లను పరీక్షించవచ్చని చెబుతున్నారు. ఒత్తిడిలో ఉన్న రుణాల పునర్నిర్మాణానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇవ్వడం ఇందుకు నేపథ్యం. అమెరికాలో ఉద్దీపన పథకానికి సంబంధించిన వార్తలకు తోడు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల నుంచి పెట్టుబడులు రావచ్చన్న భావనలు కూడా ఇందుకు దోహదం చేయవచ్చంటున్నారు. నిఫ్టీకి 11,000 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని చెబుతున్నారు. అమెరికా వార్తలకు తోడు, జూన్‌ త్రైమాసిక నిఫ్టీ కంపెనీల ఫలితాలను మదుపర్లు సునిశితంగా పరిశీలించవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* గిరాకీ పుంజుకుంటుందన్న అంచనాల మధ్య ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించవచ్చు. అయితే కరోనా వ్యాప్తి ప్రభావం కొంత పడవచ్చు.
* సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) కేసులో సోమవారం సుప్రీం కోర్టు చేసే వ్యాఖ్యల నుంచి టెలికాం షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.
* యంత్ర పరికరాల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. నిర్మాణ కార్యకలాపాలపై షరతుల కారణంగా ఆర్డర్లు స్తబ్దుగానే ఉండొచ్చు. మంగళవారం వెలువడే జూన్‌ పారిశ్రామికోత్పత్తి సూచీ గణాంకాలు కీలకం కానున్నాయి.
* వర్షాకాలం కారణంగా తక్కువ గిరాకీ ఉండడంతో సిమెంటు కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడే చలించవచ్చు. అయితే సిమెంటు ధరలు మాత్రం బలంగా ఉండడంతో షేర్లపై సానుకూల ప్రభావం కనిపించవచ్చు.
* చమురు రంగ కంపెనీల షేర్లు అంతర్లీనంగా సానుకూల ధోరణితో స్థిరీకరణకు గురికావొచ్చు. అప్‌స్ట్రీమ్‌ కంపెనీలతో పోలిస్తే రిఫైనరీ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది.
* ఔషధ కంపెనీల షేర్లు లాభాలు అందుకోవచ్చు. ఈ రంగ ఫలితాల వృద్ధిపై గట్టి ఆశలు ఉండడం ఇందుకు కారణం. కరోనా కారణంగా మదుపర్లు ఈ రంగంపై ఎక్కువగా దీనిపై దృష్టి సారిస్తున్నారు.
* వరుసగా 7 వారాల పాటు లాభాలు అందుకున్న ఐటీ షేర్లు గత వారం నష్టాల పాలయ్యాయి. ఈ వారమూ స్థిరీకరణకే లోనయ్యే అవకాశాలున్నాయి. ఇతర రంగాల వైపు మదుపర్లు మళ్లుతుండడం ఇందుకు కారణం.
* పరపతి విధాన సమీక్షలో ప్రోత్సాహకర చర్యల కారణంగా బ్యాంకు షేర్లు రాణించే అవకాశం ఉంది. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 21,000-22,000 స్థాయిల మధ్య చలించొచ్చని అంటున్నారు.
* వాహన కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడవచ్చు. వాహన డీలర్ల సంఘాల సమాఖ్య, సియామ్‌ వెలువరచే జులై నెల వాహన అమ్మకాల గణాంకాలపై మదుపర్లు దృష్టి సారించవచ్చు.
* లోహ, గనుల తవ్వక కంపెనీలు తమ సానుకూల ధోరణిని కొనసాగించవచ్చు. ఆర్థిక కార్యకలాపాల్లో రికవరీ సంకేతాలు కనిపిస్తుండడం ఇందుకు నేపథ్యం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.