close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్‌సీసీ లాభాదాయాల్లో క్షీణత

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం మొదటి త్రైమాసికంలో రూ.1328.71 కోట్ల టర్నోవర్‌ను - రూ.15.68 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్ధిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.2,371.51 కోట్లు, నికరలాభం రూ.74.70 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం, నికరలాభం గణనీయంగా క్షీణించాయి. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.1.24 నుంచి రూ.0.26 కు పడిపోయింది. కొవిడ్‌-19 వల్ల తమ వ్యాపార కార్యకలాపాలపై అధిక ప్రభావం పడిందని, అందువల్ల గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో ప్రస్తుత ఫలితాలను పోల్చి చూడలేమని కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎన్‌సీసీకి రూ.2,592 కోట్ల కొత్త కాంట్రాక్టులు లభించాయి. దీంతో కలిపి మొదటి త్రైమాసికం చివరి నాటికి చేతిలో ఉన్న కాంట్రాక్టుల విలువ రూ.27,916 కోట్లకు చేరింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.