close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.37,020 కోట్లు

పీఎన్‌బీకి 1787 మంది ఎగవేసిన మొత్తమిది

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికం ముగిసేసరికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కు 1787 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రూ.37,020.27 కోట్లు బకాయిపడ్డారు. విన్‌సమ్‌ డైమండ్‌ అండ్‌ జువెలరీ, గీతాంజలి జెమ్స్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. పీఎన్‌బీ వెబ్‌సైట్‌లో రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఎగవేసిన వారి జాబితాను బ్యాంక్‌ ఉంచింది. ఆ వివరాలు ఇలా..

*● మెహుల్‌ ఛోక్సీకు చెందిన గీతాంజలి జెమ్స్‌ చెల్లించాల్సిన రుణం రూ.5064.84 కోట్లుగా ఉంది. గీతాంజలి గ్రూప్‌ బ్రాండ్లు గిలి ఇండియా, నక్షత్ర వరుసగా రూ.1447 కోట్లు, రూ.1109 కోట్లు బకాయిపడ్డాయి.

*జతిన్‌ మెహతాకు చెందిన విన్‌సమ్‌ డైమండ్‌ రూ.1036.85 కోట్లు, ఏబీజీ షిప్‌యార్డ్‌ రూ.1193.37 కోట్లు ఎగవేశాయి.

*● చత్తీస్‌గఢ్‌ కేంద్రంగా పనిచేసే రసాయనాల సంస్థ కుడోస్‌ కెమి బ్యాంకుకు రూ.1418 కోట్లు చెల్లించాల్సి ఉంది.

*● విజయ్‌మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ.522.48 కోట్లు, జూమ్‌ డెవలపర్స్‌ రూ.702 కోట్లు, జస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ పవర్‌ రూ.453.96 కోట్లు, స్టెర్లింగ్‌ గ్లోబల్‌ ఆయిల్‌ రీసోర్సెస్‌ రూ.755 కోట్ల మేర రుణాలు ఎగవేశాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.