close

ఆటోమొబైల్‌

దేశంలో మొట్టమొదటి ‘ఇథనాల్‌’ అపాచీ ఆర్‌టీఆర్‌‌

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ ఇథనాల్‌తో నడిచే టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 ఎఫ్‌ఐ ఈ100 మోటార్‌ సైకిల్‌ని శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇథనాల్‌తో నడిచే మొట్టమొదటి మోటార్‌సైకిల్‌ దేశంలో ఇదే కావడం గమనార్హం. ఈ స్పెషల్‌ ఎడిషన్ మొదటగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీని ధర రూ. 1,20,000.

‘ద్విచక్రవాహనాల స్థిరమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగానే హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో టీవీఎస్‌ వినియోగదారులకు ఇథనాల్‌ శక్తితో నడిచే మోటార్‌సైకిల్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సంస్థ భావించింది. పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఇథనాల్‌ మోటార్‌సైకిల్స్‌ పనితీరులో ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. అంతేకాకుండా పర్యావరణానికి అనుకూలం’ అని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ తెలిపారు.

2023 నాటికి 150 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న త్రీవీలర్స్‌, ద్విచక్ర వాహనాలను విద్యుదీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో ఇలాంటి ఒక నూతన ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు వేణు పేర్కొన్నారు.
 


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.