close

గ్యాడ్జెట్స్‌

హెచ్‌టీసీ ఈజ్‌ బ్యాక్‌.. కొత్తఫోన్‌తో మార్కెట్లోకి!

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌టీసీ.. ఒకప్పుడు అగ్రగామి స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీల్లో  ఒకటి. అలాంటిది కొన్ని నెలలుగా కనుమరుగైపోయింది. దాదాపు ఏడాది తర్వాత భారత మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో అడుగుపెట్టింది. ఈ కంపెనీ బ్రాండ్‌ లైసెన్స్‌ పొందిన ‘ఇన్‌వన్‌ స్మార్ట్‌ టెక్నాలజీ’.. హెచ్‌టీసీ వైల్డ్‌ ఫైర్‌ X పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. చివరగా గతేడాది జూన్‌లో డిజైర్‌ 12, డిజైర్‌ 12+ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను హెచ్‌టీసీ తీసుకొచ్చింది. 

వైల్డ్‌ఫైర్‌Xలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి కొత్తగా ‘మై బడ్డీ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో పాటు ట్రిపుల్‌ కెమెరా,  6 నెలల ఉచిత యాక్సిడెంటల్‌, లిక్విడ్‌ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఇందులోని 3జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించగా.. 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను రూ.12,999గా పేర్కొంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు చేపట్టనున్నారు.

ప్రారంభ ఆఫర్‌ కింద వొడాఫోన్‌-ఐడియా కస్టమర్లకు రూ.3,750 విలువైన కూపన్లతో పాటు 18 నెలల పాటు రోజుకు 500 ఎంబీ చొప్పున డేటాను అందించనున్నారు. వొడాఫోన్‌ యాప్‌లో ఈ కూపన్లను రీఛార్జి కోసం వినియోగించుకోవచ్చు.

స్పెసిఫికేషన్స్‌..
డ్యూయల్‌ సిమ్‌ (నానో)తో వస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.22 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, వాటర్‌ డ్రాప్‌స్టైల్‌ నాచ్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో వస్తోంది. వెనుక వైపు 12+8+5  మెగాపిక్సెల్‌ కెమెరా సెటప్‌. వీటితో 8X జూమ్‌ వరకు ఫొటోలను తీయొచ్చు. ముందు వైపు 8 మెగాపిక్సల్‌ కెమెరాను అమర్చారు. రెండు వేరియంట్లలోనూ 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది. 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉంది.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.