Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008201
            [news_title_telugu_html] => 

‌ఫోక్స్‌వ్యాగన్‘ప్రేమ పురుగు’కనుమరుగు..!

[news_title_telugu] => ‌ఫోక్స్‌వ్యాగన్‘ప్రేమ పురుగు’కనుమరుగు..! [news_title_english] => Why Volkswagen discontinued the Beetle [news_short_description] => ‘లవ్‌బగ్‌’ ఈ పేరు వినగానే ఆటోమొబైల్‌ ప్రేమికులకు గుర్తొచ్చే పేరు ఫోక్స్‌వ్యాగన్‌ ‘బీటిల్‌’. కళ్లకు ఇంపైన ముదురు రంగుల్లో ముద్దుగా ఉండే ఈ చిన్న కారు ప్రపంచాన్ని ఏలింది.  1969లో వచ్చిన ‘ది లవ్‌బగ్‌’సినిమాతో [news_tags_keywords] => Volkswagen, Beetle,auto news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-09 10:39:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‌ఫోక్స్‌వ్యాగన్‘ప్రేమ పురుగు’కనుమరుగు..! - Why Volkswagen discontinued the Beetle - EENADU
close

కథనాలు

‌ఫోక్స్‌వ్యాగన్‘ప్రేమ పురుగు’కనుమరుగు..!

 చరిత్రలో నిలిచిపోయిన హిట్లర్‌ మానసపుత్రిక 

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లవ్‌బగ్‌’ ఈ పేరు వినగానే ఆటోమొబైల్‌ ప్రేమికులకు గుర్తొచ్చే పేరు ఫోక్స్‌వ్యాగన్‌ ‘బీటిల్‌’. కళ్లకు ఇంపైన ముదురు రంగుల్లో ముద్దుగా ఉండే ఈ చిన్న కారు ప్రపంచాన్ని ఏలింది. 1969లో వచ్చిన ‘ది లవ్‌బగ్‌’ సినిమాతో బీటిల్‌ చాలా మందికి అత్యంత ఇష్టమైన వాహనంగా మారిపోయింది. ఈ కారు గతం ఘనమైంది. ఆటోమొబైల్‌ చరిత్రలో తనకంటూ ఒక పేజీని సువర్ణాక్షరాలతో లిఖించుకొంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా  23.5 మిలియన్‌ బీటిల్స్‌ను ఫోక్స్‌ వ్యాగన్‌ విక్రయించింది. ఈ ఏడాది జులై 10న మెక్సికోలోని ప్యూబ్లా ప్లాంట్‌లో చివరి బీటిల్‌ తయారైంది. దీంతో ఫోక్స్‌వ్యాగన్‌ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. 

దిగ్గజాల కలయిక..

20వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ బ్రిటన్‌, అమెరికాల్లోని సంస్థలకు పోటీగా ఒక కారును సిద్ధం చేయాలనుకున్నారు.  వెంటనే నాజీ పార్టీ మెంబర్‌ అయిన ఫెర్డినాడో పోర్షేకు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆయన ఫోక్స్‌వ్యాగన్‌ (ప్రజల కారు)ను డిజైన్‌ చేశారు. ఈయనే పోర్షే కంపెనీ యజమాని కూడా. అప్పటికే పోర్షేకు రేసింగ్‌ కార్ల డిజైనింగ్‌లో మంచి పేరుంది. హిట్లర్‌ మెదడు నుంచి వచ్చిన ఏకైక మంచి ఆలోచనగా చరిత్రకారులు దీనిని అభివర్ణిస్తారు. ఇది ఫోర్డ్‌ మోడల్‌ టీ, బ్రిటన్‌లోని మినీ కంటే చాలా చౌకగా లభించేది. ఫోక్స్‌వ్యాగన్‌ కారు తయారీని వోల్ఫ్‌బర్గ్‌లో ప్రారంభించారు.  కానీ, 1938లో రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో ఈ కంపెనీలో తయారయ్యే కార్లను కేవలం సైనిక జనరల్స్‌ అవసరాల కోసం మాత్రమే విక్రయించారు. దీంతోపాటు ఇక్కడ ఆయుధాలు కూడా తయారు చేశారు. హిట్లర్‌ కూడా ఈ కారు కన్వర్టబుల్‌ వెర్షన్‌ను వినియోగించేవారు. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయాక ఈ కర్మాగారాన్ని బ్రిటన్‌ స్వాధీనం చేసుకొంది. యూరప్‌లో చౌకకార్లకు డిమాండ్‌ పెరగడంతో ఏటా 10,000 టైప్‌ 1 (బీటిల్స్‌)ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దీనిని జర్మనీలో కఫెర్‌ అని పిలిచేవారు. దీని అర్థం పురుగు (బీటిల్‌)అని. అప్పట్లో ఈ కార్ల తయారీ కారణంగా యూరప్‌లో ఉద్యోగాలు లభించాయి. కారు డిజైన్‌, ఇంధనం ఆదా చేసే గుణం ప్రజలను బాగా ఆకర్షించింది.

అగ్రరాజ్యాన్ని ఏలింది..

1949లో బీటిల్‌ తొలిసారి అమెరికాలో అడుగుపెట్టింది. అప్పటికే అక్కడి మార్కెట్‌ను ఫోర్డు కార్లు దున్నేస్తున్నాయి.  కానీ బీటిల్‌ లుక్స్‌, నాణ్యమైన ఇంజిన్‌ అమెరికన్లను ఆకర్షించింది. 1959లో బీటిల్‌ ప్రచారం కూడా నిజాయితీకి, వినయానికి చిహ్నంగా చూపుతూ వినూత్నంగా సాగింది. న్యూయార్క్‌లోని అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీ డీడీబీ ‘థింక్‌ స్మాల్‌’ అంటూ బీటిల్‌పై ఒక యాడ్‌ చేసింది.  ఆ ప్రచారం విజయవంతమై విక్రయాలు ఒక్కసారిగా 52శాతం పెరిగాయి. 20వ శతాబ్దంలోనే ఇదొక అత్యుత్తమ వాణిజ్య ప్రకటనగా ‘యాడ్‌ యేజ్‌’ 40ఏళ్ల తర్వాత ప్రకటించింది. అమెరికన్‌ హిప్పీస్‌ సంస్కృతిలో ఇది ఒక భాగమైంది. ఆ తర్వాత 1968లో టైప్‌-1కు అధికారికంగా బీటిల్‌ అనే పేరు ప్రకటించారు. ఈ కారు ఆధారంగా హాలీవుడ్‌లో ‘ది లవ్‌ బగ్‌’ అనే సినిమా విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత ఐదు చిత్రాల్లో ఇది ఒక తారగా వెలుగొందింది. దీంతో అమెరికాలో విక్రయాలు తారస్థాయికి చేరాయి. ఒక దశలో ఏడాదికి 4,23,000 బీటిల్స్‌ను విక్రయించింది. 1972 నాటికి మొత్తం 15మిలియన్ల బీటిల్స్‌ రోడ్లపైకి వచ్చాయి. దీంతో అత్యధికంగా విక్రయించిన కారుగా ఫోర్డ్‌ మోడల్‌ టీ పేరుతో ఉన్న రికార్డు బీటిల్‌ సొంతమైంది. కానీ తర్వాత ఈ రికార్డును టొయోటా కరోలా సొంతం చేసుకొంది.

కష్టాలు మొదలు..

కాలక్రమంలో టెక్నాలజీలో మార్పులు వచ్చి వాటర్‌ కూల్డ్‌ ఇంజిన్లు, ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధాటికి బీటిల్‌ వెనుకబడింది. దీంతో 1979లో అమెరికాలో విక్రయించే ఒరిజనల్‌ బీటిల్‌ తయారీని నిలిపివేసింది. జపాన్‌కు చెందిన టొయోటా వంటి కంపెనీలు అమెరికా మార్కెట్‌ను ఆక్రమించాయి. ఆ తర్వాత 1998లో సరికొత్త బీటిల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. అప్పటికే మార్కెట్లో లీడింగ్‌ కారుగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్‌ గోల్ఫ్‌లోని ఫీచర్లను దీనికి కూడా ఇచ్చింది. 2.0లీటర్‌ ఇంజిన్‌ బీటిల్‌ శక్తిని పెంచేసేంది. ఆకర్షణీమైన రంగులు, ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురావడంతో ఇది విజయవంతమైంది.  2013 తర్వాత మళ్లీ మార్కెట్లో బీటిల్‌ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో ఫోక్స్‌వ్యాగన్‌ ‘డీజిల్‌ గేట్‌’ కుంభకోణంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఉద్గారలపై ప్రజలను తప్పుదోవ పట్టించిన మోడళ్లలో బీటిల్‌ కూడా ఉంది. ఆ కంపెనీ కేసు నుంచి బయటపడటానికి 30 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి వచ్చింది.  ఆ ప్రభావం ఫోక్స్‌వ్యాగన్‌ అమ్మకాలపై పడింది. బీటిల్‌ విక్రయాలు పూర్తిగా పడిపోయి 4శాతానికి చేరాయి. దీంతో బీటిల్‌ శకాన్ని  ముగించాలని ఫోక్స్‌వ్యాగన్‌ భావించింది. 2019లో మెక్సికోలోని ప్యూబ్లా ప్లాంట్‌ నుంచి జులై10 చివరి బీటిల్‌ తయారు చేసింది. అలా దాదాపు 80ఏళ్ల పాటు ఆటోమొబైల్‌ ప్రియులను అలరించిన ప్రేమపురుగు చరిత్రగా మిగిలింది.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.