Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009231
            [news_title_telugu_html] => 

ఐఫోన్‌ 11.. భారత్‌లో ధర ఎంతంటే?

[news_title_telugu] => ఐఫోన్‌ 11.. భారత్‌లో ధర ఎంతంటే? [news_title_english] => Apple iPhone 11 to cost Rs 64900 in India [news_short_description] => స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్లు వచ్చేశాయ్‌. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను కంపెనీ సీఈవో స్టీవ్‌జాబ్స్‌ [news_tags_keywords] => Apple,Iphone 11,New Phone,Iphone 11 pro [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 11:29:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఐఫోన్‌ 11.. భారత్‌లో ధర ఎంతంటే? - Apple iPhone 11 to cost Rs 64900 in India - EENADU
close

గ్యాడ్జెట్స్‌

ఐఫోన్‌ 11.. భారత్‌లో ధర ఎంతంటే?

కాలిఫోర్నియా: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్లు వచ్చేశాయ్‌. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను కంపెనీ సీఈవో టిమ్‌కుక్‌ ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోన్ల భారత ధరలను యాపిల్‌ ప్రకటించింది. భారత మార్కెట్లో ఐఫోన్‌ 11 ధర రూ. 64,900 నుంచి ప్రారంభం కానుంది. 

ఐఫోన్‌ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. 64జీబీ వేరియంట్‌ ధర రూ. 64,900 కాగా.. 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 69,900, 256జీబీ వేరియంట్ ధర రూ. 79,900గా నిర్ణయించింది. ఇక ఐఫోన్‌ 11 ప్రో ధర రూ. 99,900, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ ధర రూ. 1,09,900గా ఉండనున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ నెల 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవనుండగా.. భారత్‌లో మాత్రం సెప్టెంబరు 27 నుంచి కొత్త ఐఫోన్లు వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి.  

ఫోన్లతో పాటు ఇతర గ్యాడ్జెట్లను కూడా యాపిల్‌ నిన్న ఆవిష్కరించింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌) ధర రూ. 40,900 నుంచి, వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌ + సెల్యూలార్‌) ధర రూ. 49,900 నుంచి ప్రారంభం కానుంది. యాపిల్‌ టీవీ ప్లస్‌ సేవల నెలవారీ చందాను రూ. 99గా నిర్ణయించారు. 


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.