close

గ్యాడ్జెట్స్‌

రియల్‌మీ ఫోన్లపై డిస్కౌంట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ కొన్ని మోడళ్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇటీవలే బ్లాక్‌ ఫ్రైడే పేరిట డిస్కౌంట్లు అందించిన ఆ కంపెనీ తాజాగా ‘వింటర్‌ సేల్‌ ’ సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ సేల్‌ 5 వరకు కొనసాగనుంది. రియల్‌మీ 5 ప్రో, రియల్‌మీ సీ2, రియల్‌ ఎక్స్‌, రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ 3 ఫోన్లపై డిస్కౌంట్‌ అందిస్తోంది. 

రియల్‌ మీ ‘వింటర్‌ సీజన్‌’లో రియల్‌మీ 5 ప్రో ఫోన్‌ను రూ.12,999కే విక్రయిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.13,999 ఉండగా.. వెయ్యి రూపాయలు తగ్గించింది. రియల్‌మీ సీ2 (2జీబీ/32జీబీ) ఫోన్‌ ధరను రూ.6,999 నుంచి రూ.5,999గా తగ్గించింది. రియల్‌మీ ఎక్స్‌ ధరను వెయ్యి రూపాయలు తగ్గించి రూ.15,999కే అందిస్తోంది. రియల్‌మీ 3 ప్రో ధరను 12,999 నుంచి రూ.9,999కు తగ్గించింది. రియల్‌మీ 3ని రూ.7,999కే విక్రయించనుంది. గతంలో దీని ధర రూ.8,999గా ఉండేది.

దీనికి తోడు రియల్‌మీ 5 ప్రో, రియల్‌మీ 3, రియల్‌మీ 3ఐ ఫోన్లు కొనుగోలుపై రూ.1000 కూపన్‌ను అందిస్తోంది. ఈ కూపన్‌ను రియల్‌మీ ఇతర ప్రొడక్టుల కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. అలాగే క్యాషిఫై ద్వారా ఎక్స్‌ఛేంజ్‌పై కొనుగోలుపై రూ.500 అదనంగా పొందొచ్చు. అలాగే బజాజ్‌ ఫైనాన్స్‌ కార్డులపై జీరో ఈఎంఐ సదుపాయం ఉంది.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.