close

ఆటోమొబైల్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌లోకి బిఎండబ్ల్యూ మోటోరాడ్ కొత్త బైక్‌

దిల్లీ: ప్రముఖ జర్మన్‌ మోటారు వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ స్పోర్ట్స్‌ టూరింగ్ శ్రేణిలో కొత్త బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఎక్స్‌ఆర్‌గా పిలిచే ఈ కొత్త బైక్‌ను కంప్లీట్ బిల్ట్‌ యూనిట్ (సీబీయు) తరహాలో దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. గతంలో విడుదల చేసిన బీఎండబ్ల్యూ ఎస్‌1000 ఆర్‌ఆర్ మోడల్ ఇంజిన్‌కు సరికొత్త హంగులు జోడించి ఇందులో అమర్చారు. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 20.90 లక్షలుగా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. ఐస్‌ గ్రే, రేసింగ్ రెడ్ రంగుల్లో ఈ బైక్‌ లభించనుంది.

ఈ బైక్‌లో 999సీసీ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ను అమర్చారు. ఇది 11,000 ఆర్‌పీఎం వద్ద 165 బిహెచ్‌పీ శక్తిని, 9,250 ఆర్‌పీఎం వద్ద 114 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఎల్ఈడీ లైటింగ్, బాడీ ప్యానెల్స్‌, ఫ్యూయల్‌ ట్యాంక్‌, సస్పెన్షన్‌, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌లో పలు మార్పులు చేశారు. ఇందులో రెయిన్డ్‌, రోడ్, డైనమిక్‌, డైనమిక్‌ ప్రో అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. డైనమిక్‌ ప్రో మోడ్‌లో బైక్‌ నడిపే వారికి అనుగుణంగా యాక్సిలరేషన్, ఇంజిన్‌ బ్రేక్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్ (ఏబీఎస్), ట్రాక్షన్‌ కంట్రోల్ వంటి వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ఇవి కాకుండా 6.5 అంగుళాల తాకే తెర, అందులో బీఎండబ్ల్యూ మోటోరాడ్ యాప్‌ అదనంగా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.    

‘‘అడ్వెంచర్ స్పోర్ట్స్‌ టూరింగ్ శ్రేణిలో ఎస్‌ 1000 ఎక్స్‌ఆర్‌ వినియోగదారులను తప్పక ఆకట్టుకుంటుంది. దీని ఇంజిన్‌ సామర్ధ్యం, డిజైన్‌ దూర ప్రయాణాలకు ఎంతో అనుకూలం. బైక్‌ రైడ్‌ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఇది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది’’ అని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ అర్లిండో టిక్సీరా తెలిపారు.


Tags :

కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.