close

ఆటోమొబైల్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీఎస్‌-6 వాహనాలపై గ్రీన్‌ స్టిక్కర్‌ ఉండాల్సిందే..

దిల్లీ: ఇకపై అన్ని బీఎస్‌-6 వాహనాలపై ఒక సెంటీమీటర్‌ గ్రీన్‌స్టిక్కర్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 1,2020 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర రవాణాశాఖ  నిబంధనల ప్రకారం మూడవ నెంబరు‌ ప్లేట్‌ పై భాగంలో ఈ వన్‌ సీఎమ్‌ గ్రీన్‌స్టిక్కర్‌ ఉండాల్సిందే.  2018లో మోటారుచట్టంలో చేసిన మార్పులలో భాగంగా 2019 ఏప్రిల్‌ 1 నుంచి ట్యాంపర్‌ ప్రూఫ్‌తో కూడిన హై సెక్యురిటీ రిజిష్ట్రేషన్‌ ప్లేట్లను అన్ని వాహనాలు అమర్చుకోవాలి. అప్పటి నుంచి కొత్తగా తయారువుతున్న వాహనాలన్నింటిలో విండ్‌షీల్డ్‌ లోపలివైపు బయటకు కనిపించేలా హలోగ్రామ్‌తో కూడిన స్టిక్కర్‌ను అంటిస్తున్నారు. ఆ స్కిక్కర్‌ను లేజర్‌ స్కానింగ్‌ చేయడం ద్వారా పది అంకెలతో కూడిన పర్మినెంట్‌ ఐడింటిఫికేషన్‌ నెంబర్‌ను గుర్తిస్తారు. అలాగే ఈ హలోగ్రామ్‌ సహాయంతో ఆ వాహనం ఏ ఇంధనం( పెట్రోల్‌ లేదా డీజిల్‌) సహాయంతో నడుస్తున్నదనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. 


Tags :

కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.