close

కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది.


అప్లై చేయండి ఇలా..

* పీవీసీ ఆధార్‌ కార్డు అప్లయ్‌ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

* గెట్‌ ఆధార్‌ అనే చోట Order Aadhaar PVC Card అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.

* అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్‌ కార్డు తాలూకా వర్చువల్‌ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ అయినా ఎంటర్‌ చేయొచ్చు.

* క్యాప్చా కోడ్‌, మీ ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

* మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.

* ఆ తర్వాతి పేజీలో మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. 

* పేమెంట్‌ పేజీలోకి వెళితే మీకు అక్కడ క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ ఆప్షన్స్‌లోకి వెళితే పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పేను ఉపయోగించి పేమెంట్‌ చేయొచ్చు.

* పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు ఓ రసీదు వస్తుంది. అందులో ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం సేవ్‌ చేసి పెట్టుకోండి.

* పది రోజుల్లో మీ అడ్రస్‌కు కొత్త ఆధార్‌ కార్డు వెళుతుంది. ఆధార్‌ కార్డు స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను ఉపయోగించి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో గెట్‌ ఆధార్‌ విభాగంలో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.