close

అవీ... ఇవీ

ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో వైఫై కాలింగ్‌

ముంబయి: ప్రముఖ టెలికాం కంపెనీ జియో.. వైఫై కాలింగ్‌ సేవల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా పరీక్షల దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు జియో ప్రకటించింది. జనవరి 16 వరకు దశలవారీగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి వచ్చింది. వైఫై కాలింగ్‌ సేవల్ని ఉపయోగించి వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని జియో తెలిపింది. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ ఫీచర్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే జియో ఈ ఫీచర్‌ను ప్రకటించడం గమనార్హం. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ కొన్ని మొబైల్‌ మోడళ్లకే పరిమితం కాగా.. జియో వైఫై కాలింగ్‌ సదుపాయం దాదాపు 150కి పైగా మోడళ్లలో పనిచేస్తుండడం గమనార్హం.

మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని సమయంలో ఫోన్‌ కాల్స్‌ చేసుకునేందుకు ఈ వైఫై కాలింగ్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పుడు దగ్గర్లోని ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని జియో చెబుతోంది. దీనికోసం అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇందుకోసం మీ ఫోన్‌లోని వైఫై సెట్టింగ్స్‌లో వైఫై కాలింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీ ఫోన్‌ ఈ ఫీచర్‌కు సపోర్ట్‌ చేస్తుందో లేదో ఇక్కడ తెలుసుకోండి. గత నెలలో ఎయిర్‌టెల్‌ దిల్లీ-ఎన్‌సీఆర్‌ వినియోగదారులకు వైఫై కాలింగ్‌ సేవల్ని తీసుకొచ్చింది. త్వరలో మెట్రో పాలిటన్‌ నగరాలకు విస్తరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జియో ఏకంగా దేశవ్యాప్తంగా ఈ సేవల్ని తీసుకురావడం గమనార్హం.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.