close

అవీ... ఇవీ

ఇంటర్నెట్‌ నిలిపివేతతో ఆన్‌లైన్‌ సంస్థలకు భారీ నష్టం

ముంబయి: దేశంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక చర్యలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం డిసెంబర్‌లో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. దీంతో ఆన్‌లైన్‌లో వ్యాపారం నిర్వహించే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. వారి వ్యాపారంలో దాదాపు 18-20శాతం వరకు తగ్గుదల కనిపించింది. వాస్తవానికి డిసెంబర్‌లో క్రిస్మస్‌, న్యూయర్‌ సంబరాలు వంటివి ఉండటంతో ఈ సంస్థలు భారీగా వ్యాపారం నిర్వహిస్తాయి. కాకపోతే ఈ సారి పలు ప్రాంతాల్లో రోజుల తరబడి అంతర్జాల సేవలు నిలిచిపోవడంతో చాలా మంది ఆఫ్‌లైన్‌ షాపింగ్‌నే ఎంచుకొన్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో భారీగా వ్యాపారం ఉంటుందని ఈ  కంపెనీలు ఆశించాయి.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ కారణంగా దేశంలో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం పలుచోట్ల అంతర్జాల సేవలను నిలిపేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, దిల్లీ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ రద్దు ఎక్కవ రోజులు ఉంది. వీటిల్లో యూపీ, దిల్లీ, కర్ణాటకలు అంతర్జాలాన్ని ఎక్కువగా వినియోగించే రాష్ట్రాలు. దీంతో ఈ ప్రభావం ఆన్‌లైన్‌ దిగ్గజాలపై కనిపించింది. అంతేకకాదు.. డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యాపారం కూడా కొంత తగ్గింది. ఇప్పటికే ఈకామర్స్‌ సంస్థలు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాయి.

గత ఏడాది ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌ సంస్థ ఇచ్చిన నివేదిక.. భారత్‌లో 2012-17 మధ్య గంటసేపు ఇంటర్నెట్‌ నిలిపివేస్తే రూ.13కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనావేసింది. ఇప్పటి వరకు ఆసమయంలో 16,315గంటల పాటు అంతర్జాలాన్ని నిలిపివేశారు. అంటే దాదాపు రూ.21వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు భావించాలి.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.