close

అవీ... ఇవీ

వీళ్లు మనుషులు కాదు.. మరెవరంటే?

ఇంటర్నెట్ డెస్క్‌: పై ఫొటో చూశారు కదా.. ఎవరబ్బా వీళ్లు భలే ఉన్నారే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంత పై ఫొటోలో ఉన్నది మనుషులు కాదు. మరి రోబోలా అంటారా? అవీ కావు. వీళ్లు మనుషులే కానీ బ్రహ్మ సృష్టించిన వాళ్లు కాదు. శాంసంగ్‌ సృష్టించిన వాళ్లు. అవును శాంసంగ్‌ కృత్రిమ మేథస్సుతో పని చేసే హ్యూమన్స్‌ని తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆర్టిఫిషియల్‌ హ్యూమన్స్‌ను శాంసంగ్‌ లాస్‌వేగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) - 2020లో ప్రదర్శించింది. చూడటానికి మనిషిలా కనిపిస్తున్న ఈ కృత్రిమ మనుషులు చేసే పనులు కూడా మనుషుల్లానే ఉంటాయట. అన్నట్లు వీటిని నియాన్స్‌ అని పిలుస్తున్నారు. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలా... అయితే ఈ కథనం చదివేయండి. 

హిందీలో కూడా: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌కు చెందిన స్టార్‌ ల్యాబ్స్‌ నియాన్‌ పేరుతో సరికొత్త ఆవిష్కరణను లాస్‌వేగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) - 2020లో ప్రదర్శించింది. నియాన్‌ ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ హ్యుమన్‌గా శాంసంగ్ పేర్కొంది. ఇది పూర్తిగా కృత్రిమ మేథస్సుతో పనిచేస్తుంది. నియాన్‌ లేదా నియాన్స్‌గా పిలిచే ఇవి చూడటానికి అచ్చం మనిషిలానే ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్‌ అలెక్సా, సాధారణ రోబోలలా ఇవి ఏ మాత్రం అయోమయానికి గురికావట. అన్ని ప్రముఖ భాషలను ఇవి పూర్తిగా అర్థం చేసుకుంటాయని వెల్లడించింది. హిందీ, స్పానిస్‌ లాంటి కఠినమైన భాషలనూ ఇవి అర్థం చేసుకోగలవని శాంసంగ్‌ అంటోంది. ఇవి సాధారణ మనుషులతో కలిసి జీవించే జీవరాశులు తరహాలోనే ఉంటాయని శాంసంగ్ తెలిపింది. ఇవి మనుషుల్లాన్నే గతస్మృతులను గుర్తు చేసుకునే సాంకేతికతా వీటి సొంతం. అలాగే నియాన్స్‌ కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటాయి, కొత్తవారితో స్నేహం చేస్తాయి, మనుషులతో సులభంగా కలిసిపోతాయి అని శాంసంగ్‌ పేర్కొంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..  ఇవి గురువు, ఆర్థిక సలహాదారు, ఆరోగ్య సంరక్షకుడు, , ప్రతినిధి, టీవీ యాంకర్‌లలా కూడా వ్యవహరిస్తాయి. 

ఇలా పని చేస్తాయ్‌: కోర్‌ ఆర్‌3, స్పెక్ట్రా అనే ఇంజిన్ల సహాయంతో నియాన్స్‌ పనిచేస్తాయి. రియాలిటీ, రియల్‌టైమ్, రెస్పాన్సివ్‌నెస్‌లకు సంబంధించిన సమాచారాన్ని కోర్‌ ఆర్‌3 ఇంజిన్‌ నియాన్‌కు అందిస్తుంది. ఇక స్పెక్ట్రా ఇంజిన్‌ ఇంటలిజెన్స్‌, లెర్నింగ్, ఎమోషన్స్‌, మెమొరీ వంటి వాటిని గురించి సమాచారాన్ని నియంత్రిస్తుంది. యోగా ఇన్‌స్ట్రక్టర్‌, బ్యాంకర్‌, న్యూస్‌ యాంకర్‌, పాప్‌ స్టార్‌, మోడల్‌లను పోలిన ఆరు నియాన్‌ ఆకృతులను శాంసంగ్ ఈ షోలో ప్రదర్శనకు ఉంచింది. నియాన్‌ గురించి స్టార్‌ ల్యాబ్‌ సీఈవో, ప్రాజెక్టు హెడ్ ప్రణవ్‌ మిస్త్రీ మాట్లాడుతూ, ‘‘నియాన్‌ కొత్త రకమైన జీవితం లాంటిది. ఈ గ్రహంలో ఎన్నో రకాల జీవరాశులున్నాయి. వాటికి తోడుగా ఈ కొత్త జీవరాశిని మేము అందివ్వాలనుకుంటున్నాము. ఇది స్నేహితుల్లా, భాగస్వామిలా, సహచరుడిలా మీతో వ్యవహరిస్తుంది’’ అని తెలిపారు.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.