close

గ్యాడ్జెట్స్‌

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ఎస్‌20 ఫోన్లు

శాన్‌ఫ్రాన్సికో: ప్రీమియం ఫోన్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్‌. ‘ఎస్‌’ సిరీస్‌లో ఇప్పటి వరకు తెచ్చిన ఫోన్లన్నీ టెక్‌ ప్రియులను అలరించాయి. ఇప్పుడు ఎస్‌10, ఎస్‌10+కి కొనసాగింపుగా ఈ దక్షిణకొరియాకు సంస్థ కొత్తగా మూడు ఫోన్లను తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్‌20, గెలాక్సీ ఎస్‌ 20+, గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా పేరిట గ్లోబల్‌గా ఈ మూడు ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ మూడు ఫోన్లూ 5జీ టెక్నాలజీతో వస్తున్నాయి. పైగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో కూడిన కెమెరాలు ఇందులో ఉన్నాయి.

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ‘శాంసంగ్‌ అన్‌ప్యాకెడ్‌ 2020’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. ఎస్‌20 ధర 999 డాలర్లు కాగా.. ఎస్‌20+ ధర 1199 డాలర్లు,  ఎస్‌20 అల్ట్రా ధర 1399 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మార్చి 6 నుంచి అమెరికాలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌కు ఎప్పుడొచ్చేదీ తెలియనప్పటికీ.. ప్రస్తుతానికి శాంసంగ్‌ భారత వెబ్‌సైట్‌లో ఈ ఫోన్లకు సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఎస్‌20, ఎస్‌20+, ఎస్‌20అల్ట్రా ఫీచర్లు
ఈ మూడు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 10 వన్‌యూఐ 2 ఆధారంగా పనిచేస్తాయి. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 (యూఎస్‌) ప్రాసెసర్‌ అమర్చారు. ఇతర దేశాల్లో ఎక్సినోస్‌ 990 అందిస్తున్నారు. మూడింటిలోనూ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే అందిస్తున్నారు. 120Hz స్ర్కీన్‌ రీఫ్రెష్‌ రేట్‌తో ఈ ఫోన్లు వస్తున్నాయి. ఎస్‌20లో 6.2 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే, ఎస్‌20+లో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+, ఎస్‌20 అల్ట్రాలో 6.9 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే అమర్చారు. 
 
ఎస్‌20లో 4,000 ఎంఏహెచ్‌, ఎస్‌20+లో 4,500ఎంఏహెచ్‌, ఎస్‌20అల్ట్రాకు 5,000ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అమర్చారు. కెమెరా విషయాకొస్తే.. 
ఎస్‌20, ఎస్‌20+ ఫోన్లలో 64 ఎంపీ ప్రధాన కెమెరాను అమర్చగా.. ఎస్‌20 అల్ట్రాలో 108 ఎంపీ కెమెరా ఉంది. మొదటి రెండింటికి 10ఎంపీ, మూడో ఫోన్‌కు 40ఎంపీ సెల్ఫీ కెమెరాలు అందిస్తున్నారు.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.