close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నెలకు రూ.34,900 అద్దెపై టాటా విద్యుత్‌ నెక్సాన్‌

దిల్లీ: విద్యుత్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌కు పరిమిత కాల సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ను టాటా మోటార్స్‌ ప్రకటించింది. నెలకు రూ.34,900 ఫిక్స్‌డ్‌ అద్దె చెల్లించి వినియోగదారుడు వాహనాన్ని లీజుకు తీసుకోవచ్చని తెలిపింది. మొదటి 100 మంది వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ లభిస్తుందని, 12 - 24 -36 నెలల కాలవ్యవధులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. నవంబరు 30 వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది. హైదరాబాద్‌, దిల్లీ- ఎన్‌సీఆర్‌, ముంబయి, పుణె, బెంగళూరు నగరాల్లో ఈ పరిమిత కాల ఆఫర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. సబ్‌స్క్రిప్షన్‌ కాలవ్యవధి ముగిసిన తర్వాత వినియోగదారులు పొడిగించుకునే వీలుందని లేదా వాహనాన్ని వెనక్కి ఇవ్వొచ్చని వివరించింది. సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీలో బీమా కవరేజీ, ఆన్‌-కాల్‌ 24+7 రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, ఉచిత నిర్వహణ, ఇంటికే డెలివరీ వంటివి ఉన్నాయి. వ్యక్తిగత విద్యుత్‌ వాహన ఛార్జర్‌ను ఇల్లు లేదా కార్యాలయం వద్ద ఇన్‌స్టాల్‌ చేసే సౌలభ్యాన్ని కంపెనీ కల్పిస్తోంది.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.