close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్వాలిటీ లిమిటెడ్‌లో సీబీఐ సోదాలు

రూ.1400 కోట్ల బ్యాంక్‌ మోసంపై కేసు నమోదు

దిల్లీ: ఆర్థిక ఖాతాల్లో అవకతవకలు, అక్రమంగా రుణాల తరలింపు ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పది బ్యాంకుల కన్సార్షియంను రూ.1400 కోట్లకు పైగా మోసం చేసిన ఆరోపణలపై డెయిరీ ఉత్పత్తుల సంస్థ క్వాలిటీ, సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన దాదాపు 11 రోజుల తర్వాత.. దిల్లీ, సహరాన్‌పూర్‌, బులంద్‌సహర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), అజ్‌మేర్‌ (రాజస్థాన్‌), పల్వాల్‌ (హరియాణా) పట్టణాల్లోని కంపెనీ, డైరెక్టర్లకు చెందిన 8 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అనంతరం క్వాలిటీ, కంపెనీ డైరెక్టర్లు సంజయ్‌ ధింగ్రా, సిద్ధాంత్‌ గుప్తా, అరుణ్‌ శ్రీవాస్తవా, ఇతర వ్యక్తులపై సీబీఐ కేసులు పెట్టింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ ఈ చర్యలు చేపట్టింది. పది బ్యాంకుల కన్సార్షియంలో కెనరా బ్యాంక్‌; బీఓబీ, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, సిండికేట్‌                   బ్యాంక్‌లు ఉన్నాయి.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.