close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముందుగా నింపిన జీఎస్‌టీ రిటర్న్‌ ఫారం త్వరలో!

దిల్లీ: ముందుగానే నింపిన (ప్రిఫిల్డ్‌) జీఎస్‌టీ రిటర్న్‌ ఫారం జీఎస్‌టీఆర్‌-3బీని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రకాశ్‌ కుమార్‌ తెలిపారు. ‘పన్ను చెల్లింపుదార్లకు ప్రి-ఫిల్డ్‌ జీఎస్‌టీఆర్‌-3బీని అందించేందుకు మేం కసరత్తు చేస్తున్నాం. దీని ద్వారా వాళ్లు పన్నులను సులభంగా చెల్లించొచ్చు. గత సర్దుబాట్లను లాంటివి చేసేందుకు ప్రారంభంలో ఫారంలో మార్పులకు అవకాశం కల్పిస్తామ’ని ఆయన వెల్లడించారు. కాగా.. జీఎస్‌టీఆర్‌-1లోని విక్రయాల వివరాల ఆధారంగా పన్నులు ఎంత చెల్లించాలనే వివరాలను ఇప్పటికే పన్ను చెల్లింపుదార్లకు తెలియజేయడాన్ని జీఎస్‌టీఎన్‌ ప్రారంభించింది. ఈ వివరాలను జీఎస్‌టీఆర్‌-3బీలో ఉపయోగించుకోవచ్చు. అలాగే పన్ను చెల్లింపుదార్ల సరఫరాదార్లు ఇచ్చే వివరాల ఆధారంగా రశీదులవారీగా ఇన్‌పుట్‌ ట్యాక్‌ క్రెడిట్‌ స్టేట్‌మెంట్‌ను (ఐటీసీ) కూడా ఆటోజనరేట్‌ పద్ధతిలో జీఎస్‌టీఎన్‌ అందిస్తోంది.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.